బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఫ్యాన్ ఫాలోయింగ్ విదేశాల్లోనూ పెరుగుతోంది. ఆయన సినిమాల్లో మరిచిపోలేని చిత్రం "కుచ్కుచ్ హోతా హై". తాజాగా ఈ మూవీలోని "తుమ్ పాస్ ఆయే యూముస్కు రాయే" పాటను ఇండినేషియాకు చెందిన ముగ్గురు అభిమానులు పేరడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
షారుఖ్, కాజోల్, రాణి ముఖర్జి నటించిన ఈ పాట అప్పట్లో ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ప్రస్తుతం అలాగే అచ్చుగుద్దినట్టు అనుకరించారు ఇండోనేషియా అభిమానులు. విదేశీయులు చేసిన ఈ వీడియోపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే యూట్యూబ్లో ఈ వీడియోను 14లక్షల మంది వీక్షించారు.