తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నమ్మించి మోసం చేశారంటూ జయలలిత కంటతడి - ఆలితో సరదాగా లేటెస్ట్ ఎపిసోడ్

ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' సెలిబ్రిటీ టాక్ షోకు ఈ వారం అతిథిగా హాజరయ్యారు నటి జయలలిత, వరలక్ష్మి. వీరి జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. జీవితంలో తాను మోసపోయిన విధానాన్ని వివరిస్తూ కంటతడి పెట్టుకున్నారు జయలలిత.

Senior Actress jayalalitha emotional on Alitho Saradaga Show
నమ్మించి మోసం చేశారంటూ జయలలిత కంటతడి

By

Published : Mar 9, 2021, 8:59 AM IST

ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి ఈ వారం నటి జయలలితతో పాటు సీనియర్‌ ఆర్టిస్ట్‌ వరలక్ష్మి అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమలో వారి ప్రయాణం ఎలా మొదలైంది, 'శంకరాభరణం'లో వరలక్ష్మి ఎలా నటించింది, వ్యాంప్‌ పాత్రల్లో జయలలిత ఎందుకు చేయాల్సి వచ్చిందో షోలో వివరించారు. ఈ క్రమంలో 'జీవితంలో చాలాసార్లు మోసపోయారు కదా?' అని ఆలీ ప్రశ్నించగా దానికి వివరణ ఇచ్చింది జయలలిత.

"2013 నుంచి నాతో పాటు ట్రావెల్ అయిన ఓ ఫ్యామిలీ.. నాకు బాగా తెలిసిన ఫ్యామిలీ. డీమానిటైజేషన్ వచ్చిన సమయంలో.. 'డబ్బులకు బాగా ఇబ్బంది అవుతుంది. సీరియల్ తీయలేకపోతున్నాం' అంటే నేను కూడా ఆ సీరియల్​లో ప్రధానపాత్ర పోషిస్తున్నా కాబట్టి.. ఆర్థికంగా సాయం చేశా. నా దగ్గర నుంచి వారు డబ్బులు తీసుకోవడం, ఇవ్వడం జరుగుతూ వచ్చింది. అలా 2018 డిసెంబర్ వరకు 4 కోట్ల వరకు తీసుకుని చేతులెత్తేసి వెళ్లిపోయాడు. రెమ్యూనరేషన్ తీసుకోలేదు. వడ్డీ లేదు ఏం లేదు. ఇప్పుడు నేను క్యాబ్​లో తిరుగుతున్నా. కారు లేదు. ఎన్ని కార్లు వాడానో నేను. ఈరోజున షూటింగ్ అంటే కంపెనీ వాళ్లు నాకు కారు పంపించాలి. ఇంత నమ్మి ఎలా మోసపోయాను. నా మీద నాకే అసహ్యం వేస్తుంది" అంటూ కంటతడి పెట్టుకున్నారు జయలలిత.

ABOUT THE AUTHOR

...view details