తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సర్వం 'సంగీత' మయం - rajev menon

ఏఆర్​ రెహమాన్ బాణీలందిస్తున్న 'సర్వం తాళ మయం' చిత్రాన్ని సంగీత ప్రధానాంశంగా రాజీవ్ మీనన్  తెరకెక్కించారు.

జివి ప్రకాశ్ కుమార్

By

Published : Mar 5, 2019, 11:57 AM IST

జీవీప్రకాశ్​​ కుమార్ హీరోగా నటిస్తున్న 'సర్వం తాళ మయం' చిత్రం ట్రైలర్ విడుదలైంది. సంగీత ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఆస్కార్​ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ బాణీలు సమకూర్చారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్ దర్శకత్వం వహించారు.

మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ కుర్రాడికి సంప్రదాయ సంగీతమంటే అమితమైన ఇష్టం. కర్ణాటక సంగీతం నేర్చుకుని ప్రపంచంలోనే గొప్ప విద్వాంసుడిగా పేరు తెచ్చుకోవాలనేది అతడి కల. కులం కట్టుబాట్లు, అడ్డుగోడల మధ్య ఆ కుర్రాడు తన లక్ష్యాన్ని చేరుకున్నాడా! లేదా! అనేది చిత్ర కథాంశం.

'మెరుపుకలలు', 'ప్రియురాలు పిలిచింది' లాంటి అనువాద చిత్రాలతో తెలుగులోనూ పరిచయమున్న వ్యక్తి రాజీవ్ మీనన్. 18 ఏళ్ల అనంతరం ఆయన తమిళంలో సినిమా తీశారు. తెలుగులోనూ అదే పేరుతో అనువదిస్తున్నారు. 'ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్, ఎందుకంటే.. ప్రేమంట!' చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు జీవీ ప్రకాశ్​​ కుమార్​.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details