హైదరాబాద్‌లో వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం అగ్రహీరోలంతా తమ వంతు బాధ్యతగా సహాయాన్ని ప్రకటించగా ప్రముఖ నటుడు సంపూర్ణేశ్ బాబు రూ. 50 వేలను సీఎం సహాయనిధికి అందజేశారు.
హైదరాబాద్ వరద బాధితులకు సంపూ విరాళం - సీఎం సహాయనిధికి విరాళాలు
భాగ్యనగరంలో ఉన్న వరద బాధితుల కోసం సినీ నటుడు సంపూర్ణేశ్ బాబు తన వంతు సహాయంగా విరాళాన్ని అందజేశారు. మంత్రి హరీశ్‌రావు నివాసంలో సంపూ రూ. 50 వేల చెక్‌ను అందజేశారు.
భాగ్యనగర వరద బాధితుల కోసం సీఎం సహాయనిధికి సంపూ విరాళం
హైదరాబాద్‌లోని మంత్రి హరీశ్‌రావు నివాసంలో స్వయంగా చెక్ అందజేశారు. సంపూర్ణేశ్ బాబు చేసిన సహాయం పట్ల మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. దర్శకుడు ఎన్. శంకర్ కూడా ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. పది లక్షలు విరాళంగా ప్రకటించారు.
ఇదీ చదవండిఃవర్షాలపై ట్వీట్.. ట్విట్టర్ నుంచి బ్రహ్మాజీ ఔట్!