'జయం' తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ సదా. ఆ సినిమాతో హిట్ కొట్టి.. దక్షిణాదిలో స్టార్ హీరోలు, యువ హీరోలు చాలామందికి హీరోయిన్గా నటించింది. చాలారోజుల విరామం తర్వాత మళ్లీ బుల్లితెరపై కనిపించింది. 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొని పలు ఆసక్తికర విషయాల్ని పంచుకుంది.
'జయం' సినిమా షూటింగ్ అప్పుడు జరిగిన సరదా సంగతులు, అలానే ఆ సమయంలోనే జరిగిన కారు ప్రమాదం గురించి సదా చెప్పింది. ఆ చిత్ర దర్శకుడు తేజ లాంటి క్రమశిక్షణ కలిగిన వ్యక్తిని ఇంతవరకు చూడలేదని తెలిపింది. 'అపరిచుతుడు' హీరో విక్రమ్‌తో అన్న చెల్లెలు సంబంధం గురించి కూడా వెల్లడించింది.
'నిండు నూరేళ్ల సావాసం' పాట మాత్రమే విని 'ప్రాణం' చేయడానికి ఒప్పుకొన్నానని సదా చెప్పింది. అలానే జంతువుల సంబంధించిన ఎలాంటి ఉత్పత్తులు ఉపయోగించనని తెలిపింది. అందులో భాగంగా లెదర్ పర్స్, చెప్పులు, బెల్ట్ వాడనని స్పష్టం చేసింది. ఇంకా చెప్పాలంటే పాలు కూడా తాగనని వెల్లడించింది.