తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Nataraj Master: 'రవి పులిహోర రాజా.. శ్వేతకు తిక్క.. మరి కాజల్‌..?' - నటరాజ్ మాస్టర్ వైఫ్

బిగ్​బాస్​ హౌస్​లో ఉన్నప్పుడు తన భార్య గురించే ఎక్కువగా ఆలోచించేవాడినని చెప్పారు నటరాజ్ మాస్టర్ (Nataraj Master). ఆమెకు ఇచ్చిన మాట కారణంగా హౌస్​లో ఇన్ని రోజులు ఉన్నట్లు వెల్లడించారు.

Nataraj Master
బిగ్ బాస్

By

Published : Oct 5, 2021, 7:08 PM IST

బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి తాను బయటకు రావటానికి తన కోపం కూడా ఒక కారణం అయి ఉండవచ్చని, నటరాజ్‌ మాస్టర్‌ (Nataraj Master) అభిప్రాయపడ్డారు. 'నెగ్గాలంటే తగ్గాల్సిందే' టాస్క్‌లో తన జట్టు సభ్యుడు లోబో బిర్యాని తినకపోయి ఉంటే కెప్టెన్సీ టాస్క్‌లో ఉండేవాడినని చెప్పుకొచ్చారు. గత వారం హౌస్‌ నుంచి బయటకు (Nataraj Master Elimination) వచ్చిన ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ (Nataraj Master Interview) అనేక విషయాలను పంచుకున్నారు.

"హౌస్‌లో ఉన్నప్పుడు నా భార్య (Nataraj Master Wife) సీమంతం వీడియో ప్లే చేశారు అదే నా బెస్ట్‌ మెమొరీ. బిగ్‌బాస్‌ హౌస్‌ లోపలికి వెళ్లే ముందు నా భార్యకు ఆరోగ్యపరంగా సమస్య ఏర్పడింది. దీంతో తను ఎలా ఉందోనని ఎక్కువ ఆలోచిస్తూ ఉండేవాడిని. ఆ సమయంలోనే హౌస్‌లో సీమంతం వీడియో ప్లే చేశారు. ఒకవేళ నా భార్య గురించి బిగ్‌బాస్‌ ఏ విషయం చెప్పకపోయి ఉంటే ఎమోషనల్‌గా అదుపుతప్పి పోయే వాడిని. కోపంలో ఏదో ఒకటి చేసేవాడిని. హౌస్‌లోకి వెళ్లేముందు నా భార్యకు ఇచ్చిన మాట కారణంగానే ఇన్ని రోజులైనా ఉండగలిగా. లేకపోతే వారంరోజుల్లోనే బయటకు వచ్చే (Nataraj Master Elimination) వాడిని. నా ప్రపంచంలో నా బెస్ట్‌ ఫ్రెండ్ నా భార్య"

"నామినేషన్స్‌కు (Bigg Boss 5 Eliminations) ముందు ఎవరి దగ్గరకి వెళ్లి చర్చించేవాడిని కాదు. ఇక హౌస్‌లో సినిమా డైలాగ్‌లు చెప్పడం, మీసాలు తిప్పడం అవన్నీ ప్రతి మనిషి సహజంగా చేసేవి. కోపం వచ్చినప్పుడు ఎవరైనా అలాగే చేస్తారు. నేను సినిమా ఫీల్డ్‌లో ఉన్నాను కాబట్టి, వాటి ప్రభావం నాపై ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో ఒకరు నా గురించి ఏమనుకుంటారోనని ఎప్పుడూ భయపడలేదు. ఒక టాస్క్‌లో విశ్వ, శ్రీరామ్‌ నన్ను తొక్కేద్దామనుకున్నారు. కానీ, నేనే వాళ్లను తొక్కిపడేశా. ఇప్పటివరకూ జరిగిన సీజన్లలో హౌస్‌లో బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా ఉన్న వాళ్లెవరూ బయట అలా లేరు. హౌస్‌లో ఉండేవాళ్లంతా చూపించేది ప్లాస్టిక్‌ నవ్వులు, బంధాలే. వాడి పారేయడమే. హౌస్‌లో మహిళలంటే చాలా గౌరవంతో మాట్లాడేవాడిని" అని నటరాజ్‌ మాస్టర్‌ (Nataraj Master) చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా హౌస్‌మేట్స్‌కు మరికొన్ని బిరుదులు ఇచ్చారు.

హౌస్‌మేట్స్‌కు నటరాజ్‌ మాస్టర్‌ ఇచ్చిన బిరుదులివే!

  • సన్నీ వీజే-ఆగం (అన్నీ తనకే తెలిసినట్టు చెబుతాడు. చివరకు ఈ టాస్కే వద్దు అన్న రీతిలో ప్రవర్తిస్తాడు)
  • సిరి- జాతిరత్నం (తనే స్క్రీన్‌పై కనపడాలని తాపత్రయ పడుతుంది)
  • రవి- పులిహోర రాజా (మొన్న ఈ మధ్య పులిహోర కలపడానికి ట్రై చేశాడు. అది పులిసిపోయింది. టాస్క్‌ వచ్చినప్పుడు నత్తలా.. నామినేషన్స్‌లో గుంటనక్కలా ఉంటాడు)
  • శ్వేత- తిక్క (అడిగిన విషయాలే అడుగుతూ ఉంటుంది)
  • ఉమ- అమాయకపు ఆణిముత్యం (బాగా ఆడాలని వచ్చింది. కానీ, అన్నీ తెలుసుకునేలోపే వెళ్లిపోయింది)
  • కాజల్‌- ఫిట్టింగ్‌ మాస్టర్‌
  • విశ్వ- ఊసరవెల్లి (బాగా ఎమోషనల్‌. కెమెరాల ముందు నటిస్తాడు. ఏదైనా సందర్భం దొరికితే దాన్ని తన అధీనంలోకి తీసుకుని హైలైట్‌ చేద్దామనుకుంటాడు)
  • నటరాజ్‌- ఫైర్‌స్టార్‌ (గేమ్‌ ఆడాలని నా భార్యకు ఇచ్చిన మాట కోసం ఫైర్‌ అవుతుంటాను)
  • మానస్‌- మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ (హౌస్‌లో ఎవరితో ఎలా ఆడాలో బాగా తెలిసిన వ్యక్తి. తనను తానే విశ్లేషించుకుంటూ ఉంటాడు)
  • హమీదా-సెల్ఫిష్‌, ఫిటింగ్‌ మాస్టర్‌ (ఏదైనా సమస్య వచ్చినప్పుడు సాగదీస్తూ ఉంటుంది)
  • ప్రియాంక- మంచి మనిషి (తొలుత ఇష్టం ఉండేది కాదు. తర్వాత ఆమె కథ తెలిసిన తర్వాత గౌరవం పెరిగింది)
  • ప్రియ- గేమర్‌ (గేమ్‌ ఆడుతోంది. ఎలా ఆడాలో ఆమెకు బాగా తెలుసు)
  • జస్వంత్‌ - ఫేక్‌స్టార్‌ (అదృష్టం కలిసొచ్చి ఇంకా హౌస్‌లో ఉంటున్నాడు)
  • షణ్ముఖ్‌- పరమానందశిష్యుడు(ఏంటిరా ఇది ఆడు..)
  • అనీ మాస్టర్‌- స్వార్థపరురాలు (సేఫ్‌ గేమ్‌ ఆడుతోంది)
  • లహరి- స్నేహితురాలు (రవి ద్వారా ప్రభావితమైంది. నాతో గొడవ పెట్టుకోవాలనుకుంది)
  • లోబో- తిండి పిచ్చోడు, కామెడీ స్టార్‌
  • శ్రీరామ్‌- తారజువ్వు (నటిస్తున్నాడు. నాకేమీ తెలియదు అని అందరి దృష్టి పక్కకు మళ్లిస్తున్నాడు)

ఇదీ చూడండి:bigg boss telugu 5: షణ్ముఖ్​కు షాక్​.. ఈ వారం నామినేషన్స్‌లో వీళ్లే

ABOUT THE AUTHOR

...view details