బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోన్న ఖతర్నాక్ కామెడీ షో 'ఎక్స్‌ట్రా జబర్దస్త్'. రష్మీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న ఈ ఎంటర్టైనర్ షో 350వ ఎపిసోడ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం సహా భావోద్వేగానికి గురి చేసింది. షోలో కేక్ కట్ చేసి సరదాగా ఎంజాయ్ చేయడం సహా కన్నీరు పెట్టుకున్నారు కంటెస్టెంట్లు.
రాకింగ్ రాకేష్-రోహిణి కిస్
టిక్‌టాక్ దుర్గారావు దంపతులు రాకింగ్ రాకేష్-రోహిణి స్కిట్లో స్పెషల్ ఎప్పియరెన్స్ ఇచ్చి నవ్వులు పూయించారు. ఇందులో భాగంగానే ఇటీవల విమర్శలు ఎదుర్కొన్న తమ ముద్దు సన్నివేశాన్ని గురించి వివరిస్తూ ఈ సారి ఏకంగా లిప్ లాక్‌తో అలరించారు రాకేష్-రోహిణి జంట. స్కిట్లో భాగంగా రజనీకాంత్ 'శివాజి' సినిమాలోని పాటకు బుల్లెట్ భాస్కర్-వర్ష చేసిన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఇక ఈ డ్రామాలో ఇమ్మాన్యుయేల్ చేసిన కామెడీ సూపర్. అతిలోకసుందరిగా గెటప్ శ్రీను, చిరంజీవిగా రాంప్రసాద్, మాంత్రికుడిగా సుడిగాలి సుధీర్ చేసిన స్కిట్ కితకితలు పెట్టించింది.