తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రష్మి కన్నీటి పర్యంతం.. ఏమైందంటే? - rashmi dog twitter

ఈటీవీలో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రష్మి (Rashmi Gautam news).. ట్విట్టర్​లో ఓ నెటిజన్ పంచుకున్న వీడియోపై విచారం వ్యక్తం చేశారు. ఓ వీధి కుక్కను చనిపోయే వరకు కొట్టిన వీడియోపై భావోద్వేగంతో స్పందించారు.

rashmi
రష్మి న్యూస్

By

Published : Oct 4, 2021, 8:54 AM IST

నటిగా, వ్యాఖ్యాతగా అటు వెండితెర, ఇటు బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రష్మి(Rashmi Gautam news). ఇక సామాజిక మాధ్యమాల వేదికగానూ ఆమె ఎంతో చురుగ్గా ఉంటారు. వివిధ అంశాలపై స్పందిస్తూ తన అభిప్రాయాలను పంచుకుంటారు. కించపరిచేలా సోషల్‌మీడియాలో ఎవరు మాట్లాడినా అక్కడే ఉతికి ఆరేస్తారు. రష్మి కేవలం నటి మాత్రమే కాదు, జంతు ప్రేమికురాలు కూడా. 'ఆకలేస్తే నోరు ఉన్న మనుషులు అడుగుతారు. మరి మూగ జీవాలు అడగలేవు కదా' అంటూ కరోనా సమయంలో ఎన్నో వీధి కుక్కలకు ఆహారం అందించారు. తాజాగా ఓ నెటిజన్‌ పంచుకున్న వీడియోపై విచారం వ్యక్తం చేశారు.

మధ్యప్రదేశ్‌ దేవాస్‌లోని వీధి కుక్కలను మున్సిపల్‌ సిబ్బంది పట్టుకునే క్రమంలో ఓ కుక్కకు తాడు బిగించి అది చనిపోయే వరకూ కొట్టి చంపారు. 'ఈ వీడియోను మధ్యప్రదేశ్‌లోని దివాస్‌లో చిత్రీకరించారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులు వీధి కుక్కను తాడుతో కట్టి, దాన్ని చావబాదారు. సుమారు 30 నిమిషాల పాటు అలా కొట్టి చంపారు' అని పేర్కొంటూ ఆ వ్యక్తి రష్మిని ట్యాగ్ చేశారు.

'ఆ అమానుషాన్ని మానవత్వం లేని ఎంతోమంది అలా చూస్తుండిపోయారన్నమాట. మానవజాతి తుడిచిపెట్టుకుపోయే సమయం ఇది. మనకు ఈ భూమ్మీద ఉండే అర్హత లేదు' అంటూ విలపిస్తున్న ఇమోజీని పంచుకున్నారు రష్మి. గతంలోనూ రష్మి వీధి కుక్కల సంరక్షణ, బాగోగుల గురించి ట్విటర్‌ వేదికగా గళమెత్తారు రష్మి!

ఇదీ చదవండి:'భీమ్లానాయక్​'.. రానాకు జోడీగా మలయాళీ ముద్దుగుమ్మ

ABOUT THE AUTHOR

...view details