చారిత్రక అయోధ్య నగరంలో ప్రదర్శితమవుతున్న 'రామ్‌లీలా' నాటకం ప్రేక్షకులను అలరిస్తోంది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ నాటకం.. ఉత్తరప్రదేశ్లోని సరయూ నది ఒడ్డున లక్షణ్ ఖిలాలో శనివారం ప్రారంభమైంది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు, ఈ నాటకంలో ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ప్రతిఏటా దసరా సందర్భంగా భక్తులను అలరించే రామ్‌లీలా నాటక ప్రదర్శన.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈసారి వర్చువల్‌గా నిర్వహిస్తున్నారు.
అయోధ్యలో 'రామ్‌లీలా'.. బాలీవుడ్ స్టార్స్ కనువిందు - అయోధ్యలో రామ్‌లీలా
అయోధ్యలో ప్రదర్శితమవున్న 'రామ్‌లీలా' నాటకం దూరదర్శన్లో లైవ్ ప్రసారం చేస్తున్నారు. ఇందులో పలువురు బాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అయోధ్యలో 'రామ్‌లీలా'.. ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ స్టార్స్
బాలీవుడ్ దిగ్గజ హాస్యనటుడు అస్రానీ నారద మునిగా.. రావణుడిగా షాబాజ్‌ఖాన్ కనిపిస్తున్నారు. నటుడు, భాజపా ఎంపీ మనోజ్ తివారీ అంగదుడి పాత్రలో, మరో ఎంపీ, భోజ్‌పురి నటుడు రవికిషన్ భరతుడి పాత్ర పోషిస్తున్నారు. వీరితో పాటే అవతార్ గిల్, కవితా జోషి, సోను డాగర్, రజా మురాద్ సహా పలువురు తారలు ఈ నాటకంలో కనిపించనున్నారు. వర్చువల్‌గా జరిగే రామ్‌లీలా నాటక ప్రదర్శన టీవీ, ఫేస్‌బుక్, యూట్యూబ్ సహా ఇతర సోషల్ మీడియాల్లో ప్రసారమవుతోంది.