పవన్ కల్యాణ్‌కు 'పవర్‌స్టార్' అనే టైటిల్ మొట్టమొదట తానే పెట్టినట్లు సినీ నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali News) తెలిపారు. పవన్ కల్యాణ్ రెండో సినిమా 'గోకులంలో సీత'(Pawan Kalyan Movies)కు తానే కథ అందించానని.. ఆ చిత్రంలో ఆయన నటనను పొగుడుతూ.. చిత్రం విడుదలయ్యాక పవన్‌కల్యాణ్, పవరస్టార్ అవుతారని చెప్పారు. 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి గతంలో పోసాని హాజరైనప్పుడు ఈ విషయాల్ని గుర్తుచేసుకున్నారు.
తాను ఎం.ఏ చదివేంతవరకూ తన పేరు 'జింబో' అని పోసాని వెల్లడించారు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా మద్రాస్ వచ్చానని అన్నారు. 50 రూపాయల అప్పు దొరకకపోవడం వల్ల తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నారని పోసాని కన్నీటి పర్యంతమయ్యారు. ఫ్రెండ్ కోసం తాను ప్రేమలో పడ్డానని చెప్పుకొచ్చారు.