తమ 40 ఏళ్ల సినీ కెరీర్లో 350 పైగా చిత్రాలకు(Paruchuri Brothers Movies) కథ, డైలాగులు అందించామని పరుచూరి బ్రదర్స్ చెప్పారు. తెలుగు, తమిళం, మలయాళం, ఒడిస్సీ, బంగాలీ.. ఇలా ప్రాంతంతో తేడా లేకుండా అన్ని భాషల చిత్రాలకు కథలు అందించామని అన్నారు. ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా'(Alitho Saradaga) షోకు గతంలో అతిథులుగా విచ్చేసిన పరుచూరి బ్రదర్స్.. తమ సినీ కెరీర్ గురించిన పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
ఎన్టీఆర్ కలుద్దామంటే వద్దన్నా
'చండశాసనుడు' సినిమా కథ కోసం.. ఎన్టీఆర్ కలుద్దామంటే తాను కుదరదని చెప్పానని గుర్తుచేసుకున్నారు పరుచూరి వెంకటేశ్వరరావు. ఆ సమయంలో తాను ఆడిట్ అధికారిగా ఉన్నానని.. అందువల్ల సాయంత్రం కుదరదు, మరుసటి రోజు వస్తానని చెప్పానన్నారు. ఆ తర్వాతి రోజు కలిసి కథ చెప్పానని తెలిపారు.