ఆది హీరోగా తెరకెక్కుతున్న ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ప్రచార చిత్రం విడుదలైంది. శివరాత్రి సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఈ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అబ్బూరి రవి, నిత్యానరేశ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుందీ చిత్రం.
గోల్డ్‌ఫిష్ కోసం అన్వేషణ - aadi
ఆపరేషన్ గోల్డ్‌ఫిష్ టీజర్‌ను మహేశ్ బాబు విడుదల చేశారు.
ఆది
యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాకు సాయికిరణ్ అడివి దర్శకుడు. వినాయకుడు, కేరింత లాంటి సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సాయికిరణ్. వేసవి కానుకగా ప్రేక్షకులు ముందుకు రానుందీ చిత్రం.
ప్రేమకావాలి, లవ్లీ, శమంతకమణి చిత్రాలతో విజయాలందుకున్న ఆది నెక్స్ట్ నువ్వే చిత్రం తర్వాత గ్యాప్ తీసుకున్నాడు. ఆపరేషన్ గోల్డ్‌ఫిష్ విజయంపై గట్టి నమ్మకం పెట్టుకున్నాడు ఆది.