వారిది బుల్లితెర కలిపిన బంగారు జీవితం. ప్రేక్షకుల మనసెరిగిన డాక్టర్‌బాబుగా అలరించిన నటుడు ఒకరయితే, ఆమె తన అభినయంతో ఆకట్టుకున్న అందాల చంద్రముఖి. బుల్లితెరపై తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొంది వారి కుటుంబంలో ఒకరిగా ఒదిగిపోయి వారి అభిమానాన్ని సొంతం చేసుకున్న ఆ దంపతులు పరిటాల నిరుపమ్ - మంజుల. ప్రస్తుతం తెలుగువారి బుల్లితెర శోభన్‌బాబుగా అలరిస్తున్న నిరుపమ్ ఒకనాటి నటుడు, డైలాగ్ రైటర్ ఓంకార్ తనయుడే. తాజాగా తన భార్య మంజులతో కలిసి 'ఈటీవీ'లో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి వచ్చారు. ఆలీ అడిగిన కొన్ని సరదా ప్రశ్నలకు నిరుపమ్ దంపతులు ఎలాంటి సమాధానాలు చెప్పారో.. ఆ సంగతులు ఏంటో తెలుసుకుందాం..
వెల్‌కమ్ టు ఆలీతో సరదాగా..
నిరుపమ్: థ్యాంక్ యు సర్. మాది విజయవాడ. పెరిగింది చదువుకుంది కొంతకాలం చైన్నై. స్థిరనివాసం ఏర్పరుచుకుంది హైదరాబాద్.
ఏంటి విజయవాడ చెన్నై, హైదరాబాద్ కథ?
నిరుపమ్: మానాన్న ఓంకార్. సినిమా రచయిత, నటుడు. చెన్నైలో ఉండేవారు. అమ్మ లెక్చరర్. కొంతకాలం గుడివాడలోనూ చదువుకుని మళ్లీ తిరిగి హైదరాబాద్ వచ్చా. ఇలా రకరకాలుగా తిరిగి ఇక్కడి వచ్చా.
మీది ఏ ఊరు?
మంజుల: బెంగళూరు. అక్కడ నుంచి హైదరాబాద్‌కి వచ్చా. నా మొదటి సీరియల్ 'చంద్రముఖి'. ఈటీవీలో వచ్చింది. నిరుపమ్ నాకు ఇద్దరికి ఇదే తొలి సీరియల్. ఇది ఆరున్నర సంవత్సరాలు వచ్చింది. మధ్యలో నిరుపమ్ (నవ్వుతూ) కల్పించుకుంటూ ఎలా వచ్చింది కదా ఇక్కడ నేను ఆధార్ కార్డు ఇప్పించా.
ఆధార్ కార్డు ఇప్పించావు బాగానే ఉంది. ఇంకేమీ ఇప్పించారు?
నిరుపమ్: ఇక వరుసగా పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇక్కడ ఉండటానికి సరిపడా ఏమేమీ ఇవ్వాలో అన్నీ ఇచ్చేశా. మధ్యలో మంజుల కల్పించుకుంటూ..లైఫ్‌టైమ్ కార్డు కూడా ఇప్పించారు.
మీకు పెళ్లి ఎప్పుడు జరిగింది. ఎంతమంది పిల్లలు?
నిరుపమ్: మంజుల: 2009లో పెళ్లి చేసుకున్నాం. మాకు ఒక బాబు.
మీ పెళ్లినాటికి నాన్న (ఓంకార్) లేరు?
నిరుపమ్: 2007లో చనిపోయారు. అప్పటికి నా జీవితం గురించి ఏమీ అనుకోలేదు. మేం అప్పుడు చెన్నైలో ఉండేవాళ్లం. నేను సినిమాల్లోకి వెళ్తానని, నాకోసం వాళ్లు హైదరాబాద్ వచ్చేశారు. నిజానికి నాన్నకు అవసరం లేదు. సీరియల్స్ తో చాలా బిజీగా ఉన్నారు. నాకోసం హైదరాబాద్ వద్దామని అనుకున్నారు. ఇక్కడ ఇల్లు చూశాం. కానీ నాన్న గుండెపోటుతో చనిపోయారు.
రచయితగా మీనాన్న ఎన్ని సినిమాలకి, సీరియల్స్ రాశారు? బాగా పేరు తీసుకొచ్చిన సీరియల్ ఏది?
నిరుపమ్: దాదాపు ఇరవై ఐదు వరకు సినిమాకు రచయితగా పనిచేశారు. సీరియల్స్ అంటే యాభై వరకు రాసి ఉంటారు. 'ఇది కథ కాదు', 'పవిత్ర బంధం', 'కలిసుందాం రా'. ఏ సీరియల్ తీసుకున్న వాటిలో దామోదరం అనే పేరు పెట్టుకుంటారు. ఇది మా తాతయ్య పేరు.
మీ తాత ఏం చేసేవారు?
నిరుపమ్: మెడికల్ షాపు. నాకు జ్ఞాపకం వచ్చే సరికి ఆయన రిటైర్ అయ్యారు.
మరి మీ తాత మెడికల్ ఫీల్డ్.. నాన్న చిత్రసీమలోకి రావాలని ఎందుకు అనిపించింది?
నిరుపమ్: నాన్నకు సాహిత్యం అంటే చాలా ఇష్టం. పెళ్లికి ముందే న్యూస్ రీడర్‌గా ఆల్ ఇండియా రేడియోలో పని చేశారు. ఆంధ్రజ్యోతి పేపర్‌కు ఆర్టికల్స్ రాసేవారు. అక్కడ పనిచేసే ఒక ఎడిటర్ నాన్నను ప్రొత్సహించడం వల్ల చెన్నై వెళ్లారు. అంతేకాదు ఆయన నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్‌తో కలిసి వెళ్లారు. మధ్యలో ఆలీ అందుకుంటూ నేను కూడా కాట్రగడ్డ ఆఫీస్ దగ్గర మీ నాన్న ఎక్కవ చూసేవాడిని. 'పోలీస్ భార్య' చిత్రంలో నటుడిగా నాన్నకు మంచి పేరొచ్చింది.
ఇంతకీ మీ ఆవిడ సంగతేమిటి?
నిరుపమ్: నా కెరియర్ ప్రారంభించింది ఈటీవీలో వచ్చిన 'చంద్రముఖి' సీరియల్‌తో. చంద్రముఖి (మంజుల వైపు చూస్తూ) దొరికింది. నాకు మంచి పేరొచ్చింది.
చంద్రముఖి సీరియల్‌తోనే మీ పరిచయం జరిగిందన్నమాట?
నిరుపమ్: మంజులకు తెలుగులో 'చంద్రముఖి' సీరియల్ మొదటి. నా కెరీర్‌లో మాత్రం ఈ సీరియల్‌తోనే ప్రారంభమైంది.
మీ అమ్మకి నచ్చిందా 'చంద్రముఖి' మంజుల?
నిరుపమ్: నేను తీసుకునే నిర్ణయాల మీద అమ్మకి చాలా నమ్మకం. ఒక్కసారి ఇంటికి తీసుకురా మాట్లాడదాం అని చెప్పి మాట్లాడింది. మధ్యలో మంజుల కల్సించుకుంటూ ఇంటికి పిలిపించి మాట్లాడారు. జాతకం కలవాలి. అని కచ్చితంగా చెప్పారు. అది కలిసింది. మా జీవితం బాగుంది.
మీ కుటుంబ సభ్యులు ఎంతమంది?
మంజుల: మొత్తం మేం నలుగురు సంతానం. నేను రెండోదాన్ని. అక్క, నా తర్వాత పుట్టిన చెల్లి యాక్టింగ్ వైపు రాలేదు. నేను నాలుగో చెల్లెలు చిత్రరంగంలోకి వచ్చాం. కీర్తి ఇక్కడే తెలుగులో సీరియల్స్ లోనే నటిస్తోంది. ఆమెకి పెళ్లైయ్యింది. ఆమె భర్త కూడా ఇదే రంగంలో ఉన్నారు.
అప్పుడప్పుడు అనిపిస్తుందా.. నాన్న జీవించి ఉంటే నా సక్సెస్‌ను చూసి ఆనందించేవారని..
నిరుపమ్: చాలా సార్లు అనిపిస్తోంది. అసలు నేను సినిమా రంగంలోకి వెళ్లాలి అనుకున్నా.
ఈ రంగంలోకి రావడానికి మీ నాన్న ప్రొత్సహించారా.. లేక వద్దని చెప్పారా?
నిరుపమ్: నాన్నకి ఇష్టం లేదు. అందుకే నా చుట్టుపక్కల సినీ వాతావరణం ఉండేనిచ్చేవారు కాదు. అయితే అప్పుడు మా ఇంట్లోకి అసిస్టెంట్ దర్శకులు వచ్చేవారు. అప్పుడు నేను వారితో కలిసి ఉండేవాడిని. అప్పుడు నాన్న వెళ్లి పనిచూసుకో అంటూ చెప్పేవారు. నా ఇంజనీరింగ్ చదువు అయిపోచ్చింది. పై చదువుల కోసం నేను అమెరికా వెళ్తారని అనుకున్నారు. ఓ రోజు నాన్న నన్ను చెన్నైలోని ఆంధ్రాక్లబ్ తీసుకెళ్లి ఇంజనీరింగ్ అయిపోతుంది. తర్వాతే ఏమిటి అడిగారు. నాన్న చాలా సరదాగా ఉంటారు నాతో. కొంచెం నేను కూడా కళామాతల్లికి సేవ చేసుకోవాలని ఉంది అన్నా. అంతే అక్కడి నుంచి వెంటనే ఇంటికి తీసుకెళ్లారు. ఆరోజు ఆయనకు నిద్రపట్టలేదు. అప్పుడు అమ్మ అడిగింది. ఏంటి ఇంత పొద్దున్నే లేచావు నాన్నను. వాడు నిన్న నాకో షాకింగ్ న్యూస్ చెప్పాడని అమ్మకు చెప్పారు. అమ్మ వాళ్ల తోబుట్టువులు ఏడుమంది. వాళ్లంతా ప్రిన్నిపల్స్, టీచర్లు. వారిలా ఏదో శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటాని అనుకుంది. నేను సినిమా అనే సరికి అమ్మకి కోపం వచ్చి. ఏంటి ఇంత చదువు చదివించింది ఇందుకోసమేనా అని ఏడ్చేసింది. ఇక నాన్న మాత్రం ఒక్కటే చెప్పారు. ముందు చదువు పూర్తి చేసుకో ఆ తర్వాత ఓ నిర్ధిష్ట సమయం పెట్టుకొని ప్రయత్నించమని సలహా. ఓ సారి నన్ను మా సీరియల్లో హీరో వేషం ఉంది. చేస్తావా అని అడిగారు. నేను సినిమాల్లో తప్ప సీరియల్స్ చేయనని చెప్పాను. తమిళం సినిమాల్లో కొద్దిగా ప్రయత్నించా కానీ మనం ఇక్కడ సరిపోం అనిపించింది.
మీరు తెలుగు సీరియల్స్ ఎలా వచ్చారు?
మంజుల: మొదట్లో కన్నడలో చేశాను. కానీ అస్సలు నేను నటించాలని అనుకోలేదు. అలాంటి ఆశలు కూడా పెట్టుకోలేదు. ఓసారి ఆడిషన్న్ జరుగుతుంటే మానాన్న స్నహితులే మీ అమ్మాయి బాగుంటుంది కదా. ఆడిషన్న్కు పంపించు అని చెప్పారు. అప్పుడు నేను ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నా. సరే అని ఆడిషన్స్‌కి వెళ్లా సెలక్ట్ అయ్యాను. అలా వచ్చా. కన్నడలో ఆర్కా మీడియాలో చేసేటప్పుడే తెలుగులోనూ వాళ్లే చేస్తున్నారు. అప్పుడే నన్ను తెలుగులో నటించమని అడిగారు. నేను మాత్రం చెయ్యను అని చెప్పా. ఎందుకంటే నాకు భాష తెలియదు. వేరే రాష్టం. ఇక్కడ తెలిసిన తెలుగు స్నేహితులు కూడా ఎవరూ లేరు. నాకు కష్టం అవుతుందని చెప్పా. కానీ వాళ్లు చెయ్యండమ్మా చాలా బాగుంటుందని చెప్పారు. అంతేకాదు నాకోసం కన్నడ తెలిసిన కోడైరక్టర్ పెట్టారు. అప్పుడు ఒప్పుకున్నా. వచ్చి ఇక్కడ చేశాను. అరె ఊరికే భయపడ్డాను. నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఇక్క అక్కడి నుంచి తెలుగులో 'చంద్రముఖి'తో నా కెరీర్ ప్రారంభమైంది.
నిరుపమ్‌ని మొదటిసారి చూడగానే నీమదిలో ఏమనిపించింది?
మంజుల: నిరుపమ్ వైపు చూస్తు (నవ్వుతూ)..అప్పడాయన చాలా సన్నగా ఉండేవారు. మధ్యలో నిరుపమ్ కల్పించుకుంటూ "అప్పుడు నేను గుండుతో ఉన్నాను (అప్పటికే నాన్న చనిపోయారు). నన్ను చూసి ఇంతకంటే మంచి హీరో దొరకలేదా.. చెన్నైని నుంచి తీసుకురావాలా అని" అంది. నాకు ఇదే అభిప్రాయం మనసులో ఉంది. తర్వాత ఆయన నటన చూసి మంచి అభిప్రాయం కలిగింది. కొత్తగా ఎవరైనా యాక్టింగ్‌లో వస్తే తెలిసిపోతుంది. కానీ ఆయన నటన అలా అనిపించలేదు. బాగా చేశారు.
మీ ఇద్దరు ముద్దుగా ఏమని పిలుచుకుంటారు?
నిరుపమ్ - మంజుల: నేను మంజు అని పిలుస్తా. పెళ్లికి ముందైతే గుండు..లడ్డులాంటి పేర్లతో. నేనైతే ముద్దొచ్చినప్పుడు బక్కోడా అని పిలుచేస్తా.
మీ ఆయన్ని రెండు తెలుగురాష్ట్రాల ప్రజలు బక్కచిక్కిన శోభన్‌బాబు అని అంటారట?
నిరుపమ్: లేదండి. మధ్యలో మంజుల కల్సించుకుంటూ అవును తెలుసు.
కథ వినాలన్నా.. సీరియల్ చేయాలన్నా అటొకరు ఇటొకరు ఉంటేనే చేస్తావని వార్త?