బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన రియాలిటీ షో బిగ్‌బాస్ కార్యక్రమానికి సంబంధించిన మరో కొత్త సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్స్ పూర్తి చేసుకొని ఐదోసారి(Bigg Boss Telugu Season 5) ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. కరోనా కారణంగా జులైలోనే ప్రారంభం కావాల్సిన ఈ రియాలిటీ షో.. సెప్టెంబరుకు వాయిదా పడినట్లు సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ గ్యాప్‌లో పోటీదారులను ఎంపిక చేసే పనిలో పడిందట బిగ్‌బాస్ బృందం.
Bigg Boss 5: బిగ్‌బాస్‌లో ఈ సారి కొత్త హోస్ట్! - బిగ్‌బాస్‌లో రానా దగ్గుబాటి
బుల్లితెర రియాలిటీ షో బిగ్బాగ్ ఐదో సీజన్(Bigg Boss Telugu Season 5) వ్యాఖ్యాతగా టాలీవుడ్‌లోని ఓ విలక్షణ నటుడ్ని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అనేక సినిమాల్లో విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నటుడు రానా దగ్గుబాటి(Rana Daggubati).. రాబోయే బిగ్‌బాస్ సీజన్లో హోస్ట్‌గా వ్యవహరించనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది.
తొలి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా.. రెండో సీజన్ కోసం హీరో నాని.. ఆ తర్వాత మూడు, నాలుగు సీజన్లలో 'కింగ్' నాగార్జున హోస్ట్‌గా(Bigg Boss Telugu Host) పనిచేశారు. అయితే ఈ సారి మరో హీరోను హోస్ట్‌గా ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 'నంబరు.1 యారి' కార్యక్రమంలో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో రానా దగ్గుబాటిని(Rana As Bigg Boss Host) ప్రస్తుత సీజన్‌కు హోస్ట్‌గా ఎంపిక చేశారని సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇదీ చూడండి..బిగ్‌బాస్ సెట్ సీజ్ చేసిన పోలీసులు