తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తెలుగులోకి నెట్​ఫ్లిక్స్​.. తొలి సిరీస్​ విడుదల ఎప్పుడంటే?

ప్రముఖ డిజిటల్​ స్ట్రీమింగ్​ సంస్థ నెట్​ఫ్లిక్స్ తెలుగులో అడుగుపెట్టనుంది. 'పిట్టకథలు' సిరీస్​తో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నట్లు బుధవారం ప్రకటించింది. ఫిబ్రవరి 19న ఈ సిరీస్​ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.​

By

Published : Jan 20, 2021, 1:13 PM IST

Netflix announces Telugu anthology feature 'Pitta Kathalu'
తెలుగులోకి నెట్​ఫ్లిక్స్​.. తొలి సిరీస్​ విడుదల అప్పుడే​

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్​ఫ్లిక్స్​ తెలుగులో తొలి వెబ్​సిరీస్​ను నిర్మించింది. 'పిట్టకథలు' అనే ప్రాజెక్టుతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నట్లు నెట్​ఫ్లిక్స్​ బుధవారం ప్రకటించింది. దానికి సంబంధించిన టీజర్​ను సోషల్​మీడియాలో విడుదల చేసింది. నాలుగు భాగాలుగా రూపొందిన ఈ సిరీస్​కు తరుణ్​ భాస్కర్​, నందినీ రెడ్డి, నాగ్​ అశ్విన్​, సంకల్ప్​ రెడ్డి సంయుక్తంగా దర్శకత్వం వహించారు.

నలుగురు ధైర్యవంతులైన మహిళల నేపథ్యంతో ఈ సిరీస్​ రూపొందనుంది. ఈషా రెబ్బా, లక్ష్మీ మంచు, అమలా పాల్​, శ్రుతి హాసన్​ కీలకపాత్రలు చేయగా.. అషిమా నర్వాల్​, జగపతి బాబు, సత్యదేవ్​, శాన్వీ మేఘన, సాజిత్​ హెగ్డేతో పాటు తదితరులు ఈ సిరీస్​లో అలరించనున్నారు. ఫిబ్రవరి 19న ఈ సిరీస్​ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇదీ చూడండి:ఊహతో తొలి పరిచయం అప్పుడే: శ్రీకాంత్​

ABOUT THE AUTHOR

...view details