ప్రముఖ దర్శకులు మణిరత్నం (Mani Ratnam)-జయేంద్ర (Jayendra Panchapakesan).. సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. 'నవరస'(Navarasa) పేరుతో తొమ్మిది లఘచిత్రాల్ని నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో సూర్య(Suriya)తో పాటు అరవింద స్వామి, సిద్దార్థ్, విజయ్ సేతుపతి, ప్రకాశ్ రాజ్, రేవతి, నిత్యా మేనన్, పార్వతి, ఐశ్వర్య రాజేశ్, పూర్ణ, ప్రసన్న, సింహా, గౌతమ్ కార్తిక్, అశోక్ సెల్వన్, రోబో శంకర్ తదితరులు నటిస్తున్నారు. దీనికి సంబంధించిన టీజర్‌ను శుక్రవారం చిత్రబృందం విడుదల చేసింది.
Navarasa: 'నవరసా'ల టీజర్ వచ్చేసింది - మణిరత్నం నవరస
తమిళ స్టార్స్ కలిసి నటించిన వెబ్‌సిరీస్ 'నవరస'(Navarasa). దీనికి సంబంధించిన ఇటీవలే చిత్రబృందం విడుదల చేసిన కొన్ని స్టిల్స్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఈ వెబ్‌సిరీస్‌ను ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న క్రమంలో శుక్రవారం టీజర్‌ను విడుదల చేశారు.
![Navarasa: 'నవరసా'ల టీజర్ వచ్చేసింది Navarasa web series Teaser released](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12401810-thumbnail-3x2-hd.jpg)
నవరస టీజర్
'నవరస' ఆంతాలజీని నటనలోని తొమ్మిది రసాలు(హాస్యం, శృంగారం, కోపం etc..) ఆధారంగా తెరకెక్కించనున్నారు. దీని కోసం ప్రముఖ దర్శకులైన బెజోయ్ నంబియర్, గౌతమ్ మేనన్, కార్తిక్ సుబ్బరాజ్, కార్తిక్ నరేన్, కేవీ ఆనంద్, పొన్రమ్, రతీంద్రన్ ప్రసాద్, హరితా సాలిమ్, అరవింద స్వామి పనిచేయనున్నారు. వీరితో పాటే 40 మంది ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు.. ఈ ప్రాజెక్టులో భాగం కానున్నారని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
ఇదీ చూడండి..Navarasa: సినీ కార్మికుల కోసమే ఈ 'నవరస'