గత వారం రోజులుగా బిగ్‌బాస్ (Bigg boss) హౌస్‌లో జరిగిన పరిణామాలపై నాగార్జున (Nagarjuna) మాట్లాడారు. ఈ సందర్భంగా తరచూ గొడవ పడుతున్న షణ్ముఖ్(Shanmukh), సిరి(siri)లపై అసహనం వ్యక్తం చేశారు. ఇరువురిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి క్లాస్ తీసుకున్నారు. తనని తాను గాయపరుచుకున్న సిరిపై మండిపడ్డారు. "ఇలాంటి పరిస్థితి హౌస్‌లో అవసరమా?" అని ప్రశ్నించారు. "ఏమో సర్.. నాకు క్లారిటీ లేదు. నా స్టోరీ నాకు తెలుసు. బయట నేనేంటో తెలుసు. అయినా బంధం ఏర్పడుతోంది. ఎందుకో తెలియడం లేదు" అంటూ సిరి కన్నీటి పర్యంతమైంది.
బయటకు వెళ్లిపో..!