అమ్మా.. అనే పిలుపు చాలు. మది పులకించిపోతుంది. మనసు కరిగిపోతుంది. నేనున్నా అంటూ అక్కున చేర్చుకుని.. ప్రేమ కురిపిస్తుంది, బాధ ఉంటే.. పంచుకుంటుంది. ఇలాంటి ప్రేమకు ప్రతిరూపంగానే అంతర్జాతీయ మాతృ దినోత్సవం జరుపుకొంటారు. ఇలాంటి మాతృ మూర్తులకు కానుకగా క్యాష్ స్పెషల్ ఎపిసోడ్‌ను చిత్రీకరించారు. ఆదివారం (మే9) మదర్స్ డే సందర్భంగా నేడు ఈ షో ప్రసారమవనుంది.
కడుపుబ్బా నవ్విస్తోన్న మదర్స్ డే క్యాష్ ప్రోమో - తనీష్, అర్చన్ క్యాష్ ప్రోమో
మాతృ దినోత్సవం కానుకగా చిత్రీకరించిన క్యాష్ స్పెషల్ ఎపిసోడ్ ఆకట్టుకుంటోంది. నేడు రాత్రి 9.30 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారమవనుంది.
మదర్స్ డే క్యాష్ ప్రోమో
సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ లేటెస్ట్ ప్రోమో ఆకట్టుకుంటోంది. తనీష్, అర్చన, సామ్రాట్, దీప్తి వారి తల్లితో పాటు విచ్చేశారు. సుమ పంచ్‌లు, సెలబ్రిటీల కౌంటర్లతో షో సరదాగా సాగిపోయింది. సామ్రాట్ బారసాల, దీప్తి అక్షరభ్యాసం, అర్చన అన్నప్రాసన వంటి సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తున్నాయి. నేడు రాత్రి 9.30 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. అప్పటివరకు దీనికి సంబంధించిన ప్రోమో చూసేయండి.