ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన వెబ్‌సిరీస్‌గా గుర్తింపు పొందింది 'మనీ హైస్ట్'. ఇప్పటివరకు నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ఆఖరిదైన ఐదో సీజన్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇటీవలే దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తైంది. ఈ నేపథ్యంలో ఆఖరి సీజన్‌ను రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఓ ప్రకటనలో తెలిపింది. తొలి భాగాన్ని ఈ ఏడాది సెప్టెంబరు 3న.. రెండో భాగాన్ని ఇదే ఏడాది డిసెంబరు 3న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది.
రెండు భాగాలుగా 'మనీ హైస్ట్' చివరి సీజన్
ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన 'మనీ హైస్ట్' వెబ్ సిరీస్ ఐదో సీజన్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ను రెండు భాగాల్లో విడుదల చేయనున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
రెండు భాగాలుగా 'మనీ హేస్ట్' చివరి సీజన్
దీంతో ఈ స్టోరీ ఎండింగ్‌ను ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్‌లో ప్రొఫెసర్, తమాయో, బొగొత, సూరెజ్, బెర్లిన్, డెన్వెర్ పాత్రలకు చాలామంది అభిమానులు ఉన్నారు.
ఇదీ చూడండి..'మనీ హైస్ట్' ఆఖరి సీజన్ షూట్ కంప్లీట్
Last Updated : May 24, 2021, 10:16 PM IST