తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నాన్నపై భయంతో వెనక డోర్​ నుంచి పారిపోయిన విష్ణు

తన తండ్రి మోహన్​బాబు వస్తున్నారని తెలిసి, ఒకానొక సమయంలో హీరో విష్ణు రెస్టారెంట్ బ్యాక్​డోర్ నుంచి పారిపోయారట. ఇంతకీ ఏం జరిగింది? ఎప్పుడు?

Manchu vishnu ali tho saradag episode
విష్ణు

By

Published : Aug 25, 2021, 12:31 PM IST

Updated : Aug 25, 2021, 12:51 PM IST

హీరో మంచు విష్ణు.. 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరై పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. పెద్దల అంగీకారంతో తను ప్రేమ వివాహం ఎలా చేసుకున్నానో వివరించారు. తన లవ్​స్టోరీలో చాలా ట్విస్టుల ఉన్నాయని, వాటన్నింటిని పూసగుచ్చినట్లు చెప్పారు.

విష్ణు వెరోనికా

తాను వెరోనికా ఏడాది పాటు ఎవరికీ తెలియకుండా ప్రేమించుకున్నామని విష్ణు చెప్పారు. అయితే అమ్మకు దీని గురించి తెలిసినా.. నాన్నకు మాత్రం చాలారోజులు తెలియకుండా దాచిపెట్టానని అన్నారు. తాజ్​కృష్ణలో వెరోనికా తాను ప్రతిరోజూ లంచ్​కు కలిసేవాళ్లమని చెప్పిన విష్ణు.. ఒకానొక సందర్భంలో జరిగిన సంఘటన గుర్తు చేసుకున్నారు.

"ఎప్పటిలానే ఓ రోజు నేను, వెరోనికా లంచ్​ కోసం రెస్టారెంట్​కు వచ్చాం. సరిగ్గా అదే రోజు అనుకోకుండా నాన్న కూడా అక్కడికి వచ్చారు. అయితే రెస్టారెంట్​ వాళ్లకు మా ప్రేమ గురించి ముందు నుంచే తెలుసు. ఓ రోజు​ సర్వర్ పరుగెత్తుకుంటూ పెద్ద సర్ వస్తున్నాడని నాకు చెప్పాడు. దీంతో ఏం చేయాలో తెలియక నాకు చెమటలు పట్టేశాయి. అప్పుడు మేనేజర్​ వచ్చి, సర్ మీరు ఏం అనుకోనంటే కిచెన్ వెనక ఉన్న డోర్ నుంచి వెళ్లొచ్చు అని చెప్పారు. అలా అప్పుడు బయటపడ్డాం" అని విష్ణు ఆనాటి సంగతుల్ని చెప్పారు.

ఆ తర్వాత మీడియాలో న్యూస్ రావడం వల్ల తన ప్రేమ విషయం ఇంట్లో తెలిసిందని విష్ణు చెప్పారు. ఆ తర్వాత దాసరి పద్మ ఆంటీ రంగంలోకి దిగి, నాన్నకు నచ్చజెప్పారని తెలిపారు. అలా చాలా ట్విస్టులు తర్వాత పెద్దల అంగీకారంతో తన పెళ్లి జరిగిందని విష్ణు వెల్లడించారు.

మంచు విష్ణు కుటుంబం

ఇవీ చదవండి:

Last Updated : Aug 25, 2021, 12:51 PM IST

ABOUT THE AUTHOR

...view details