తెలంగాణ

telangana

By

Published : Jan 18, 2022, 7:48 AM IST

ETV Bharat / sitara

మది మదినీ కదిలించే సరికొత్త ధారావాహిక మనసంతా నువ్వే..

etv telugu serial: మనసుకు హత్తుకునే ఎన్నో సీరియల్స్​కు వేదికైన ఈటీవీ మరో కొత్త ధారావాహికను మీ ముందుకు తీసుకు రానుంది. ప్రేమ నేపథ్యంలో సాగే ఈ సీరియల్​ సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8.30 గంటలకు ప్రసారం కానుంది. మనసంతా నువ్వే పేరుతో రానున్న ఈ ధారావాహిక బుధవారం నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది.

manasantha nuvve
మనసంతా నువ్వే

etv telugu serial: ఓ అందమైన అమ్మాయి... అంతులేని ఐశ్వర్యం.. ఆప్యాయతలు పంచే పొందికైన కుటుంబం.. అన్ని అర్హతలూ ఉన్న ఓ అబ్బాయి విదేశాల నుంచి వచ్చి 'మనసంతా నువ్వే' అన్నాడు. అయినా.. ఆ ప్రేమ ప్రయాణానికి అడుగడుగునా ముళ్ల బాటలే ఎదురయ్యాయి. అయినవాళ్ల అనురాగాలే ప్రేమకి ప్రతిబంధకాలైతే... మంచి మనసులే ప్రేమికులకు పెనుశాపాలైతే..??

రేపటి నుంచి మనసంతా నువ్వే డైలీ సీరియల్‌ సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8.30గం.లకు ఈటీవీలో ప్రసారం అవుతుంది.

అనూహ్యమైన మలుపులతో, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో సాగే సరికొత్త ధారావాహిక 'మనసంతా నువ్వే' రేపటి నుంచి ప్రతి రాత్రి 8.30 గం.లకు ఈటీవీలో ప్రారంభమవుతోంది. రాధాకృష్ణ టాకీస్‌ నిర్మిస్తున్న ఈ డైలీసీరియల్‌కు మలినేని రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ 'ఇది కేవలం ఒక అబ్బాయి- అమ్మాయి మధ్య నడిచే వినూత్నమైన ప్రేమ కథ మాత్రమే కాదు..ఒక అన్నకి-చెల్లెకి మధ్య విడదీయలేని అనుబంధం వల్ల జరిగే ఘర్షణని, ఇద్దరు స్నేహితుల మధ్య అంతులేని అభిమానం వల్ల జరిగే సంఘర్షణనీ ప్రతి క్షణం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసే కథాకథనాలతో అందిస్తుంది 'మనసంతా నువ్వే'. ఇందులోని భావోద్వేగాలు అన్ని వయసుల వారినీ అమితంగా ఆకట్టుకుంటాయని ధృడంగా నమ్ముతున్నాం' అన్నారు. సీరియల్‌లో ముఖ్య పాత్రలో నటించిన ప్రముఖ నటుడు సంజయ్‌ భార్గవ్‌ మాట్లాడుతూ 'చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని, ఇంత కథాబలం కలిగిన ధారావాహికలో నటించడం ఎంతో తృప్తిని కలిగిస్తోంద'ని అన్నారు. కేరళకు చెందిన ప్రముఖ నటీమణులు విందూజ- అశ్వతి ఈ సీరియల్‌లో ఇద్దరు కథానాయికలుగా నటించడం విశేషం. ఇంకా ఈ సీరియల్‌లో నవీన యాట, శ్రీలత, ఏకనాథ్‌, సంజయ్‌కుమార్‌, మాధవీలత, ఉదయభగవతుల తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

ఇదీ చూడండి:ఆన్సర్ చెప్పిన ఆ వ్యక్తికి వార్నింగ్ ఇచ్చిన బాలయ్య!

ABOUT THE AUTHOR

...view details