తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో బ్రెత్​లెస్ సాంగ్.. మాధవన్ ట్వీట్ - etv sridevi drama company

ప్రతి ఆదివారం ఈటీవీలో ప్రసారమయ్యే ఎంటర్​టైన్​మెంట్ షో 'శ్రీదేవి డ్రామా కంపెనీ'. ఈ కార్యక్రమంలోని ఓ అద్భుతమైన సింగింగ్​ వీడియోను ప్రముఖ నటుడు మాధవన్ ట్వీట్ చేశారు. భలే పాడారు ఎలా సాధ్యమైందంటూ ప్రశంసించారు.

madhavan etv sridevi drama company
మాధవన్

By

Published : Nov 25, 2021, 4:41 PM IST

ప్రముఖ నటుడు ఆర్‌. మాధవన్‌ ఈటీవీలో ప్రసారమయ్యే 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కార్యక్రమం గురించి తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. (madhavan movies)

సెప్టెంబర్‌12న ప్రసారమైన 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ట్విన్స్‌ సింగర్‌ స్పెషల్‌ ఎపిసోడ్‌ అందరినీ ఆకట్టుకుంది. అందులో స్వర-జయన్‌ అనే కవలల్లో స్వర అనే గాయకుడు శంకర్‌ మహదేవన్‌ ఆలపించిన బ్రెత్‌లెస్‌ సాంగ్‌ను(Breathless Song) 2 నిమిషాల 24 సెకన్ల పాటు నాన్‌స్టాప్‌గా పాడారు. ఇప్పుడు ఆ పాటకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌ను మాధవన్‌ తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు.(sridevi drama company latest promo)

"ఏ మాత్రం బ్రేక్స్‌ ఇవ్వకుండా పాడటం అసలు ఎలా సాధ్యమైంది. పాడేకొద్ది సేపు ఇతను ఊపిరి తీసుకున్నట్లు కూడా అనిపించలేదు. భగవంతుడు అతడికి గొప్ప టాలెంట్‌ అందించాడు" అని మాధవన్ రాసుకొచ్చారు.

ఇదే పాటను ఇండియన్‌ ఐడల్‌ -5 ఫినాలే వేదికపై సింగర్‌ శ్రీరామ చంద్ర పాడారని.. ఆ తరువాత అదే రీతిలో పాడింది స్వర అంటూ షోలో చెప్పాడు యాంకర్‌ సుడిగాలి సుధీర్‌.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details