తెలంగాణ

telangana

ETV Bharat / sitara

లాక్​డౌన్​ ఎత్తివేత- 20న థియేటర్ల పరిస్థితి ఏంటి? - సినిమా వార్తలు

తెలంగాణలో లాక్​డౌన్​ ఎత్తేయడంతో ఇన్ని రోజుల నుంచి మూతపడ్డ థియేటర్లు ఆదివారం నుంచి తెరుచుకోనున్నాయి. చిత్రీకరణ పూర్తి చేసుకున్న పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి.

theatres open
థియేటర్స్​ ఓపెన్​

By

Published : Jun 19, 2021, 7:36 PM IST

తెలంగాణలో లాక్​డౌన్​ ఎత్తేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇన్ని రోజుల నుంచి మూతపడ్డ థియేటర్లు రేపటి నుంచి తెరుచుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇన్ని రోజులు లాక్ డౌన్​ నిబంధనలు పాక్షికంగా ఉండటం వల్ల సినిమా చిత్రీకరణ అంతంత మాత్రంగానే సాగింది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నా.. అడ్డంకులు తొలగే వరకు వేచి చూశారు నిర్మాతలు.

ఆదివారం నుంచి లాక్​డౌన్​ నిబంధనలు ఉండబోవని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో స్క్రిప్ట్​​ వర్క్​ పూర్తి చేసుకున్న సినిమాలు సెట్స్​పైకి వెళ్లడానికి సిద్ధమయ్యాయి. చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు మొదట రానున్నాయో వేచి చూడాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details