తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నైట్​ డ్రస్సులో రమ్మంటే వారు ఆశ్చర్యపోయారు..! - LAKSHMI MANCHI FEET UP WITH THE STAR TALK SHOW

తను నిర్వహించే కొత్త టాక్ షో 'ఫీట్ అప్ విత్ ద స్టార్' గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది నటి మంచు లక్ష్మీప్రసన్న. ప్రముఖ నటీనటులు హాజర్యయే ఈ కార్యక్రమం.. ఈనెల 23 నుంచి ప్రారంభం కానుందని చెప్పింది. ప్రతి సోమవారం ఓ కొత్త ఎపిసోడ్​తో ముందుకొస్తామని తెలిపింది.

మంచు లక్ష్మీ ప్రసన్న-సమంత- వరుణ్​తేజ్

By

Published : Sep 19, 2019, 9:02 PM IST

Updated : Oct 1, 2019, 6:28 AM IST

ప్రముఖ నటుడు మోహన్‌బాబు వారసురాలిగా వెండితెరకు పరిచయమైనా, తనదైన ప్రతిభతో గుర్తింపు తెచ్చుకుంది మంచు లక్ష్మీ ప్రసన్న. సినిమాల్లోనే కాకుండా 'లక్ష్మీ టాక్‌ షో', 'ప్రేమతో మీ లక్ష్మీ', 'నేను సైతం' వంటి కార్యక్రమాలతో బుల్లితెర ప్రేక్షకులను మురిపించింది. ఇప్పుడు 'ఫీట్‌ అప్‌ విత్‌ ద స్టార్‌' అనే సరికొత్త కార్యక్రమంతో డిజిటల్‌ మీడియాలో సందడి చేసేందుకు సిద్ధమైందీ నటి. ఆ సందర్భంగా ఈ షోకు సంబంధించిన విశేషాలను గురువారం హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించింది.

నటి, నిర్మాత మంచు లక్ష్మీ ప్రసన్న

" ఇప్పటి వరకు నేను చేసిన షోలలో 'ఫీట్ అప్ విత్ ద స్టార్స్' చాలా భిన్నమైనది. ఇందులో పాల్గొనేందుకు వచ్చే స్టార్స్​ను నైట్​డ్రెస్​లో రమ్మంటే వారిలో కొందరు ఆశ్చర్యపోయారు. మరికొందరు ఉత్సాహంగా ముందుకొచ్చారు. బాలీవుడ్​లో ఈ తరహా కార్యక్రమాలు సాధారణమే, కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం చాలా కొత్త. ఇందులో ఎక్కడా అభ్యంతరకర, వివాదాస్పద ప్రశ్నలకు తావులేదు. స్టార్స్​కు సంబంధించిన కొత్త విషయాలు ఇందులో తెలుసుకుంటారు. హీరోయిన్ సమంత, తన భర్త నాగ చైతన్య గురించి ఈ షోలో మాట్లాడిన విషయాలు ప్రతిఒక్కరిని ఆశ్చర్యపరుస్తాయి. వరుణ్​తేజ్ మీకు మరింత కొత్తగా పరిచయం కాబోతున్నాడు" -మంచు లక్ష్మీ ప్రసన్న, నటి-నిర్మాత

ఓ యాప్‌ ద్వారా ప్రసారం కాబోయే ఈ కార్యక్రమం ఈనెల 23 నుంచి ప్రారంభం కానుంది. ప్రతి సోమవారం కొత్త ఎపిసోడ్ అందుబాటులోకి వస్తుంది.

ఇది చదవండి: అబ్బాయితో ప్రేమలో పడిన ఆయుష్మాన్​ ఖురానా..!

Last Updated : Oct 1, 2019, 6:28 AM IST

ABOUT THE AUTHOR

...view details