తెలంగాణ

telangana

ETV Bharat / sitara

KBC 1000 Episode: అందుకే కేబీసీకి వ్యాఖ్యాతగా మారాను: అమితాబ్

KBC 1000 Episode: ప్రఖ్యాత టీవీ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' ఇటీవల 1000వ ఎపిసోడ్​ పూర్తిచేసుకుంది. ఈ ప్రత్యేక ఎపిసోడ్​లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుమార్తె, మనవరాలు ప్రత్యేక అతిథులుగా పాల్గొని సందడి చేశారు. ఈ క్రమంలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు హోస్ట్ బిగ్​బీ.

KBC 1000 Episode
కౌన్ బనేగా కరోడ్‌పతి

By

Published : Dec 5, 2021, 12:19 PM IST

Updated : Dec 5, 2021, 12:29 PM IST

KBC 1000 Episode: భారతీయ టెలివిజన్‌ రంగంలోనే అత్యంత విజయవంతమైన షోగా 'కౌన్ బనేగా కరోడ్‌పతి' పేరుగాంచింది. ఈ ప్రోగ్రాం ప్రారంభమైనప్పటి నుంచీ అంటే 2000వ సంవత్సరం నుంచి బాలీవుడ్​ మెగాస్టార్​ అమితాబ్ బచ్చన్​ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అయితే.. ఇటీవల షో 1000వ ఎపిసోడ్​ డిసెంబర్​ 3న పూర్తిచేసుకుంది. ఈ క్రమంలో తాను ఈ ప్రోగ్రాంకు వ్యాఖ్యాతగా రావడానికి గల కారణాలను వెల్లడించారు బిగ్​బీ. ఆ సమయంలో సినిమా అవకాశాలు పెద్దగా రాలేదని, పనిలేకపోవడం కారణంగా కౌన్ బనేగా కరోడ్‌పతి షోకు వ్యాఖ్యాతగా మారానని అన్నారు.

ఈ ప్రత్యేక ఎపిసోడ్​లో బిగ్​బీ కుమార్తె శ్వేతా బచ్చన్​తోపాటు ఆయన మనవరాలు నవ్యానందా పాల్గొన్నారు. అమితాబ్ సతీమణి జయా బచ్చన్ సైతం.. వీడియో కాల్​ ద్వారా ముచ్చటించారు. 1000వ ఎపిసోడ్​పై స్పందిస్తూ.. "ఈ షో 2000 జులై 3లో ప్రారంభమైంది.. ఇప్పటికి 21ఏళ్లు పూర్తయ్యాయి. తాను బుల్లితెరకు రావడాన్ని అప్పట్లో విమర్శించడం గుర్తుంది. దాని వల్ల నాపై ప్రభావం పడుతుందని చెప్పారు. ఆ సమయంలో నాకు పనిలేకపోవడం వల్లే ఈ షోకు వ్యాఖ్యాతగా మారాను" అని బిగ్​బీ చెప్పుకొచ్చారు.

'కౌన్ బనేగా కరోడ్‌పతి' మొదటి ఎపిసోడ్​కు ప్రేక్షకుల స్పందన చూసిన తర్వాత తనకెంతో సంతోషం కలిగిందని.. ప్రపంచం మారిపోయిందని అనిపించిందని అమితాబ్ అన్నారు. ఈ క్రమంలో తన కుమార్తె, మనవరాలితో సరదాగా ముచ్చటించారు బిగ్​బీ.

ఇదీ చూడండి:నా భార్యకు టన్నుల కొద్ది ప్రేమలేఖలు రాశాను: అమితాబ్

Last Updated : Dec 5, 2021, 12:29 PM IST

ABOUT THE AUTHOR

...view details