తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వీడియోలో ఆమె.. కన్నీరు వచ్చేలా నవ్విన కామ్నా - మూవీ న్యూస్

హీరోయిన్ కామ్నా జెఠ్మలానీ గురించి ఎవరికీ తెలియని విషయం ఒకటుంది. అది చేస్తే చాలు కామ్నా విరగబడి నవ్వుతుంది. ఇంతకీ ఏంటా విషయం? దానిగురించి ఎవరు చెప్పారు?

Kamna Jethmalani Alitho Saradaga episode
హీరోయిన్ కామ్నా జెఠ్మలానీ

By

Published : Jul 6, 2021, 10:14 AM IST

టీనేజ్​ వయసులోనే మిస్ ముంబయిగా నిలిచి, తెలుగు సినిమాలో అవకాశం దక్కించుకుని హీరోయిన్​ అభిమానుల మనసుల్ని అలరించింది ముద్దుగుమ్మ కామ్నా జెఠ్మలానీ. 'ప్రేమికులు', 'రణం', 'బెండు అప్పారావు', 'కత్తి కాంతారావు' లాంటి చిత్రాల్లో నటించి గుర్తింపు కూడా తెచ్చుకుంది. ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' షోలో పాల్గొని తన జీవిత, సినీ విశేషాలను వెల్లడించింది. ఒంటరిగా పాస్​పోర్ట్​ లేకుండా చైనా వెళ్లిన విషయం గురించి కూడా చెప్పింది.

హీరోయిన్ కామ్నా జెఠ్మలానీ

తన ముద్దు పేరు డింకీ అని, చిన్నప్పుడు కొంచెం బొద్దుగా ఉండటం వల్ల అమ్మ ఆ పేరు పెట్టారని కామ్నా అలీతో చెప్పింది. దాదాపు 500 వరకు స్టేజి షోలు చేశానని వెల్లడించింది. 'చోడ్ దో ఆంచల్' ఆల్బమ్ సాంగ్ హిట్​ అయిన తర్వాత ఒంటరిగా చైనా వెళ్లిన విషయాన్ని గుర్తు చేసుకుంది. అప్పటివరకు తనకు పాస్​పోర్ట్​ లేదని, అప్పుడే అప్లై చేసుకుని వెళ్లినట్లు తెలిపింది. అలానే చైనాలో ఫుడ్​ చూసి తాను భయపడిపోయినట్లు కామ్నా చెప్పింది.

బెస్​ఫ్రెండ్​, నటి పూనమ్ బజ్వా.. వీడియో సందేశాన్ని అలీ షోలో ప్రదర్శించారు. కామ్నా గురించి ఎవరికీ తెలియని విషయాన్ని ఆమె అందులో చెప్పింది. చిన్న జోక్ వేసినా సరే కామ్నా పగలబడి నవ్వుతుందని, నవ్వుతూనే ఉంటుందని చెప్పింది. ఆమె వీడియోలో ఈ మాట చెబుతుంటే షోలో ఉన్న కామ్నా కంట్లో నుంచి నీరు వచ్చేలా నవ్వింది. ఆమె తన పక్కన ఉంటే చాలా హ్యాపీగా ఉంటానని కామ్నా చెప్పింది.

హీరోయిన్ కామ్నా జెఠ్మలానీ

అలానే అల్లరి నరేశ్, దేవిశ్రీ ప్రసాద్, శ్రద్ధాదాస్​తో పాటు మరికొందరు కూడా టాలీవుడ్​లో ఫ్రెండ్​ అని కామ్నా చెప్పింది. డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల కృష్ణవంశీ 'చందమామ' సినిమాలో అవకాశం తప్పిపోయిందని తెలిపింది. మరో నాలుగైదు పెద్ద చిత్రాల్లోనూ ఛాన్స్​లు మిస్సయ్యాయని వెల్లడించింది. పూరీ జగన్నాథ్, రాజమౌళి సినిమాల్లో నటించాలని ఉందంటూ తన మనసులోని మాట బయటపెట్టింది. మహేశ్​బాబు 'సైనికుడు' చేసినప్పటికీ, పూర్తిస్థాయిలో ఒకేఒక్క స్పెషల్ సాంగ్ చేయాలని ఉందని తన కోరిక గురించి చెప్పింది.

ABOUT THE AUTHOR

...view details