తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కెనడియన్​ పాప్​ సింగర్​కు ఏమైంది?​ - BABY SONG

మానసిక కుంగుబాటుకు లోనవుతున్నాడు పాప్ గాయకుడు జస్టిన్ బీబర్. ఈ విషయాన్ని ఇన్ స్టాలో పంచుకున్నాడీ 25 ఏళ్ల సింగర్.

జస్టిన్ బీబర్

By

Published : Mar 11, 2019, 8:01 PM IST

కెనడియన్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ మానసిక కుంగుబాటుతో బాధపడుతున్నాడు. ఎవరితోనూ కలవకుండా ముభావంగా ఉంటున్నాడు. దీన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తన ఇన్​స్టాలో వెల్లడించాడీ పాప్ గాయకుడు. కొన్ని రోజులుగా కుంగుబాటుపై చికిత్స కూడా తీసుకుంటున్నట్లు తెలిపాడు బేబీ సింగర్.

"నేను ఎప్పటిలాగే తిరిగి మీ ముందుకు వస్తాను. దీని గురించి పెద్దగా బాధ పడట్లేదు. మిమ్మల్ని ఒక్కటే కోరుతున్నాను. నా కోసం భగవంతుడిని ప్రార్థించండి. నా జీవితంలో అత్యంత క్లిష్ట పరిస్థితిని అనుభవిస్తున్నాను"

--జస్టిన్ బీబర్, పాప్ గాయకుడు

చిన్నవయసులోనే ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు బీబర్. వయసుకి మించిన పేరు ప్రఖ్యాతలు అతడిపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయని ఆయన బార్య హెయిలే బాల్ద్విన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details