తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జంతువులతో జమ్వాల్

"జంగ్లీ" చిత్రం కోసం విద్యుత్ జమ్వాల్ తీవ్రంగా శ్రమించాడు. కలరిపట్టు కళలోని జంతు శైలిని(జంతువుల వ్యవహార శైలి) ప్రత్యేకంగా నేర్చుకున్నాడు.

ఏనుగుపై విద్యుత్ జమ్వాల్

By

Published : Mar 6, 2019, 4:01 PM IST

విద్యుత్ జమ్వాల్ నటించిన 'జంగ్లీ' ట్రైలర్ విడుదలైంది. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు చక్ రసెల్ తెరకెక్కించారు. యాక్షన్ థ్రిల్లర్​గా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూజా సావంత్, ఆశా భట్, అతుల్ కులకర్ణి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

అంతర్జాతీయ స్మగ్లర్ల నుంచి ఓ కుర్రాడు అటవీ జంతువులను ఎలా రక్షించాడనేది చిత్ర కథాంశం. విజువల్స్, పోరాట సన్నివేశాలతో హాలీవుడ్​ సినిమాను తలపిస్తోందీ చిత్రం.

ఈ సినిమా కోసం జమ్వాల్ తీవ్రంగా శ్రమించాడు. కలరిపట్టు కళలోని జంతు శైలిని ప్రత్యేకంగా నేర్చుకున్నాడు. కమాండో సిరీస్​తో గుర్తింపు తెచ్చుకున్నాడు ఇతడు...శక్తి, ఊసరవెల్లి, సికిందర్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడే.

ది మాస్క్, ఎ నైట్ ఎల్మ్ స్ట్రీట్, ది స్కార్పియన్ కింగ్ లాంటి విజయవంతమైన హాలీవుడ్ చిత్రాలను తెరకెక్కించిన చక్ రసెల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రోహన్ సిప్పి కథను అందించగా వినీత్​జైన్, ప్రీతి సహానీ నిర్మించారు.

ABOUT THE AUTHOR

...view details