కిక్ సినిమాలో సల్మాన్‌తో ఆడిపాడిన జాక్వలిన్ ఫెర్నాండేజ్ మరోసారి కండలవీరుడితో జంటగా నటించనుంది. కిక్ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కనున్న 'కిక్ 2'లో అవకాశాన్ని అందిపుచ్చుకుంది జాక్వలిన్. సాజిద్ నడియావాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సీక్వెల్ చిత్రాలతో కష్టమంటున్న శ్రీలంక సుందరి - kick2
సీక్వెల్ చిత్రాల్లో నటించడం అంత సులభం కాదంటోంది జాక్వలిన్ ఫెర్నాండేజ్. తాజాగా సల్మాన్ సరసన 'కిక్ 2' సినిమాలో నటించనుందీ శ్రీలంక సుందరి.
గతంలో రేస్, హౌస్‌ఫుల్, జుడ్వా సీక్వెల్స్‌లో నటించిన జాక్వలిన్.. కొనసాగింపు చిత్రాల్లో నటించడం అంత సులభం కాదని చెబుతోంది. ప్రేక్షకులు ఎన్నో అంచనాలతో థియేటర్లకి వస్తారని, వాటిని అందుకోలేనప్పుడు నిరుత్సాహపడతారని తెలిపిందీ శ్రీలంక భామ.
'కిక్ 2'తో పాటు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో కలిసి 'డ్రైవ్' చిత్రంలోనూ నటిస్తుంది జాక్వలిన్. ఈ సినిమా జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్షయ్ కుమార్, రోహిత్ శెట్టి కాంబినేషన్లో వస్తున్న 'సూర్యవంశీ'లోనూ జాక్వలిన్నే కథానాయిక.