Sudigali Sudheer: 'జబర్దస్త్'లో 'సుడిగాలి సుధీర్' టీమ్ అంటే నవ్వులకు పెట్టింది పేరు. వైవిధ్యమైన కామెడీతో సుధీర్, శ్రీను, రామ్‌ప్రసాద్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటారు. ఒక్కోసారి అసలు ఏ కాన్సెప్ట్ లేకున్నా ఏదో ఒక మాయ చేసి నవ్వుల సునామీ సృష్టిస్తారు. అలాంటి అదిరిపోయే కాంబినేషన్ వారిది. అయితే ఈ టీమ్‌లో త్వరలో మార్పులు రానున్నాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇటీవలే విడుదలైన ప్రోమోనే అందుకు కారణం.
జబర్దస్త్ 'సుడిగాలి సుధీర్' టీమ్ సంచలన నిర్ణయం- ఇదే లాస్ట్! - ఆటో రాంప్రసాద్
Sudigali Sudheer team change: జబర్దస్త్‌లో సుడిగాలి సుధీర్ టీమ్‌కు ఉండే క్రేజే వారు. సినిమాల్లో బ్రహ్మానందం కనిపిస్తే ఆటోమెటిగ్గా నవ్వేసినట్టుగా.. బుల్లితెరపై గెటప్ శ్రీను, సుధీర్, ఆటో రామ్‌ప్రసాద్ ఏదో ఒక మాయ చేసి నవ్వించేస్తారు. ఇన్నేళ్ల పాటు కలిసి పనిచేసి, లక్షలాది ప్రేక్షకులను నవ్విస్తూ వచ్చిన ఈ కమెడియన్లు త్వరలో షాకింగ్ వార్త చెప్పేలా కనిపిస్తున్నారు.
డిసెంబర్ 10న ప్రసారంకానున్న ఎక్స్ట్రా జబర్దస్త్ షోకు సంబంధించిన ప్రోమోలో శ్రీను, సుధీర్, రామ్‌ప్రసాద్ తొలుత టీమ్‌లో కొత్త వారిని చేర్చేందుకు ప్రయత్నించారు. రాకెట్ రాఘవ, హైపర్ ఆది ఇళ్లకు వెళ్లి మరీ ఈ విషయం అడిగారు. అయితే.. కాసేపటికే సుధీర్, శ్రీను, రామ్‌ప్రసాద్ భావోద్వేగానికి గురికావడం కనిపించింది. ఇన్నాళ్లూ తమను ఆదరించిన ప్రేక్షకులను ధన్యవాదాలు చెబుతూనే.. 'ఇకపై జబర్దస్త్ నుంచి మేము..' అంటూ క్షమాపణలు చెబుతూ ముగించారు.
ఇదీ చూడండి:Sudigali sudheer movies: సుడిగాలి సుధీర్ టెన్షన్ టెన్షన్?