తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'జబర్దస్త్' అదిరే అభి అంత పిసినారా? - జబర్దస్త్ హైపర్ ఆది

నటి రోజా, సింగర్ మనో న్యాయనిర్ణేతలుగా ఈటీవీలో ప్రసారమవుతోన్న కామెడీ షో 'జబర్దస్త్'. దీనిపై సంబంధించిన తాజా ప్రోమో అలరిస్తోంది. అదేంటో మీరూ చూసేయండి.

jabardast latest promo
అదిరే అభి అంత పిసినారా?

By

Published : Mar 3, 2021, 4:47 PM IST

నటి రోజా, సింగర్‌ మనో న్యాయనిర్ణేతలుగా ఈటీవీలో ప్రసారమవుతోన్న కామెడీ షో 'జబర్దస్త్‌'. అనసూయ వ్యాఖ్యాతగా ప్రసారమవుతోన్న ఈ కామెడీ షో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ షోకి సంబంధించిన తాజా ప్రోమో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తోంది.

హైపర్ ఆది '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' స్పూఫ్​తో పంచ్​లతో అలరిస్తుండగా, అదిరే అభి రాజులాగా సందడి చేశాడు. గడ్డం నవీన్​తో కలిసి పంచ్​ల వర్షం కురిపించాడు. అలాగే తాగుబోతు రమేశ్, సాయి ఒకే ఆపిల్​ను తింటున్న సమయంలో యాంకర్ రోజా వారిపై పంచ్​లు వేశారు. చలాకీ చంటి స్కిట్​లో హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్​తో ఫేమస్ అయిన టిక్​టాక్​ లాఫింగ్ స్టార్ సందడి చేశాడు. ఇంకా రాకెట్ రాఘవ, వెంకీ మంకీస్ తమ స్కిట్​తో అలరించారు. ఈ ఎపిసోడ్ గురువారం రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానుంది. అంతకుముందు ఈ ఫన్నీ ప్రోమోనూ మీరూ చూసేయండి.

జబర్దస్త్ ప్రోమో

ABOUT THE AUTHOR

...view details