మార్చి 16న ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో మెల్బా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆధ్వర్యంలో ఓ భారీ ఈవెంట్ జరగనుంది. ఈ ప్రోగ్రాంలో ఈటీవీ జబర్దస్త్, ఢీ షోలకు చెందిన హాస్యనటులు, డ్యాన్సర్స్ 25 మంది పాల్గొననున్నారు. యాంకర్ ప్రదీప్, సుడిగాలి సుధీర్, వర్షిని, విష్ణుప్రియ, భాను, డాన్స్ మాస్టర్ యశ్ తదితరులు సందడి చేయనున్నారు.
ఆస్ట్రేలియాలో 'జబర్దస్త్' - anchor pradeep
తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచే ఏకైక కార్యక్రమం ఈటీవీ జబర్దస్త్ త్వరలోనే కంగారూల గడ్డపై అలరించనుంది. మెల్బోర్న్లో మార్చి16న నిర్వహించే భారీ షో లో 25 మంది "జబర్దస్త్"నటులు, "ఢీ" డ్యాన్సర్లు ప్రేక్షకులకు వినోదాన్ని అందించనున్నారు.
ఆస్ట్రేలియాలో 'జబర్దస్త్'
మెల్ బా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రతినిధి శ్రీహరి మాట్లాడుతూ..."తొలిసారిగా ఇక్కడ తెలుగు వారి కోసం చేస్తున్న షో ఇది. చారిత్రక పాలేస్ థియేటర్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇందులో కామెడీ, డ్యాన్స్, సింగింగ్, మ్యాజిక్ షో హైలైట్ గా నిలుస్తాయి" అని తెలిపారు.
Last Updated : Mar 5, 2019, 12:32 AM IST