ధారావాహికలు, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్‌తో తరచూ ప్రేక్షకుల్ని అలరిస్తూ.. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు పలువురు నటీమణులు, వ్యాఖ్యాతలు. ఇప్పుడు వీళ్లందరూ సోషల్‌మీడియా వేదికగా తమలోని డ్యాన్స్ టాలెంట్ బయటపెడుతున్నారు. పలు పాపులర్ పాటలకు రీల్స్ క్రియేట్ చేసి ఇన్‌స్టా వేదికగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
వావ్.. బుల్లితెర భామలు ఇరగదీస్తున్నారు! - వైరల్ వీడియో
ఇన్స్టాగ్రామ్ వేదికగా బుల్లితెర భామలు అదరగొడుతున్నారు. క్లాసూ, మాసూ అని తేడా లేకుండా అనేక పాటలకు రీల్స్ చేస్తూ దుమ్ము లేపుతున్నారు. శ్రీముఖి, దీప్తి సునైనా వీడియోలు వైరల్‌గా మారుతుండగా.. వాటికి ఫిదా అయిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
శ్రీముఖి
ఈ మధ్యకాలంలో పలువురు తారలు తమ ఆటపాటలతో వావ్ అనిపించారు. స్టార్స్ వీడియోలు చూసిన నెటిజన్లు.. వన్స్‌మోర్ అనకుండా ఉండలేకపోతున్నారు. శ్రీముఖి, విష్ణు ప్రియతోపాటు మరెంతోమంది భామలు హొయలొలికించేలా చేసిన డ్యాన్సులపై మీరే ఓ లుక్కేయండి.
ఇదీ చూడండి:'ఆ ప్రశంస ప్రత్యేకం.. ఎప్పటికీ మర్చిపోలేను'