Grammy awards news: అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జరగాల్సిన గ్రామీ అవార్డుల వేడుక వాయిదా పడింది. ఈ విషయమై గ్రామీ అధికారిక ప్రసార సీబీఎస్, ది రికార్డింగ్ అకాడమీ ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.
షెడ్యూల్ ప్రకారం జనవరి 31న ఈ వేడుక నిర్వహించాల్సి ఉంది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వీటి వల్ల ఈవెంట్లో ఇబ్బంది ఏర్పడవచ్చని అకాడమీ అంచనా వేసింది. సంగీత నిర్వహకులు, ప్రేక్షకులు, వేడుక కోసం పనిచేసే సిబ్బంది ఆరోగ్య భద్రతే తమకు ముఖ్యమని చెప్పిన అకాడమీ.. త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని పేర్కొంది.