తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Google Jobs: గూగుల్ సంస్థలో ఆ జంతువుకు ఉద్యోగం.. ఎందుకంటే? - క్యాష్ షో

జంతువులకు ఎవరైనా ఉద్యోగం ఇస్తారా? కానీ మీరు నమ్మి తీరాల్సిందే. ప్రఖ్యాత సెర్చ్​ఇంజిన్ సంస్థ గూగుల్(Google Jobs)​ ఎక్కడాలేని విధంగా తొలిసారి ఓ జంతువుకు ఉద్యోగం ఇచ్చింది. మరి ఆ జంతువేంటి? ఈ ఆశ్చర్యకర సంఘటన ఎప్పుడు జరిగింది?

google company
గూగుల్ సంస్థ

By

Published : Sep 30, 2021, 1:17 PM IST

గూగుల్(Google Jobs) లాంటి సంస్థలో ఉద్యోగం కోసం ఎంతోమంది యువత కలలు కంటారు. గూగుల్​లో ఉద్యోగానికి అంతపోటీ ఉంటుంది. కానీ ఆ సంస్థ తొలిసారిగా ఓ జంతువుకు ఉద్యోగం ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. అవును.. 'రఫియా'(Raffia Camel) అనే ఒంటెకు 2014లో ఉద్యోగం కల్పించింది గూగుల్(Google Jobs)​.

ఒంటెలు సాధారణంగా ఎడారిలో ప్రయాణిస్తుంటాయి. అలా రఫియా(Raffia Camel) ఎడారిలో ప్రయాణించేటప్పుడు దానికి కెమెరాలు అమర్చారు. అది ఎడారిలో తిరుగుతూ.. 360 డిగ్రీల కోణంలో ఎడారి అందాలను చిత్రీకరించింది. అత్యంత ఉష్ణ్రోగత ఉన్న ఎడారి ప్రాంతంలో ఇలా చిత్రాలను తీయటం మనుషులకు కష్టతరం కాబట్టి ఆ ఒంటెను ఉద్యోగిగా గూగుల్ నియమించుకుంది!

ఈటీవీలో(ETV Cash Programme) ప్రసారమవుతూ.. వినోదాన్ని విజ్ఞాన్ని పంచే కార్యక్రమంగా పేరున్న క్యాష్​ ప్రోగ్రామ్​లో(Suma Kanakala Cash Programme) ఈ ప్రశ్నను వ్యాఖ్యాత సుమ అడిగారు. దీనికి ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన ప్రియమణి, మంచులక్ష్మి, అడివి శేష్​, జబర్దస్త్ సుధీర్.. హాస్యాస్పదంగా సమాధానం చెప్పారు.

ఈ ప్రశ్నకు ప్రియమణి సరైన సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో మరికొన్ని ప్రశ్నలు సంధించారు సుమ. వీటి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి.

ప్రశ్న:ఏనుగులు 3 కిలోమీటర్ల దూరం నుంచి దేని వాసన పసిపట్టగలవు?

నీరు

ఇదీ చదవండి:Vijay thalapathy movies: విజయ్ సినిమాలో నేచురల్ స్టార్ నాని!

ABOUT THE AUTHOR

...view details