తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సమంత 'ఫ్యామిలీ మ్యాన్ 2' హవా.. 10 విభాగాల్లో నామినేట్ - samantha web series

సమంత విభిన్న పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'ద ఫ్యామిలీ మ్యాన్ 2'. ఫిల్మ్​ఫేర్ అవార్డుల కోసం ఈ సిరీస్.. 10 విభాగాల్లో నామినేట్ అయింది. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్​లో అందుబాటులో ఉంది.

samantha
సమంత

By

Published : Nov 12, 2021, 8:57 PM IST

లాక్‌డౌన్‌ కారణంగా ఓటీటీకి ఆదరణ పెరిగింది. స్థానిక చిత్రాలతోపాటు జాతీయ, అంతర్జాతీయ చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రేక్షకుల్ని తనవైపు తిప్పుకుంది. అందుకే దర్శకనిర్మాతలు, అగ్ర నటులు సైతం ఓటీటీ వేదికగా సందడి చేస్తున్నారు. వీరి కష్టాన్ని గుర్తిస్తూ.. ప్రతిభను ప్రోత్సహించే విధంగా ఫిల్మ్‌ఫేర్‌ గతేడాది నుంచి ఓటీటీ అవార్డ్స్‌ అందిస్తోంది. 2021గానూ ఈ అవార్డ్స్‌కు నామినేట్ అయిన సిరీస్‌ల జాబితాను ఫిల్మ్‌ఫేర్‌ ఇటీవల ప్రకటించింది. ఈ మేరకు 2020 ఆగస్టు 1 నుంచి 2021 జులై 31 మధ్య విడుదలై, విశేష ప్రేక్షకాదరణ పొందిన వాటిని ఎంపిక చేసింది.

ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్​లో సమంత

వీటిల్లో ప్రముఖ నటి సమంత కీలక పాత్ర పోషించిన 'ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌ 2'.. 10 విభాగాల్లో నామినేట్‌ అయింది. బెస్ట్‌ సిరీస్‌, బెస్ట్‌ డైరెక్టర్‌ (రాజ్‌ అండ్‌ డీకే, సుపర్న్‌ ఎస్‌. వర్మ), బెస్ట్‌ యాక్టర్‌ - మేల్‌ (మనోజ్‌ బాజ్‌పాయ్‌), బెస్ట్‌ యాక్టర్‌ - ఫిమేల్‌ (సమంత), బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌- ఫిమేల్‌ (ఆశ్లేషా ఠాకూర్‌), బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌ -మేల్‌ (షరిబ్‌ హష్మి), (సన్నీ హిందూజ), బెస్ట్‌ ఒరిజినల్‌ స్టోరీ (సుమన్‌ కుమార్‌, రాజ్‌ అండ్‌ డీకే), బెస్ట్‌ డైలాగ్స్‌ (సుపర్న్‌ ఎస్‌ వర్మ, సుమన్‌ కుమార్‌, రాజ్‌ అండ్‌ డీకే, మనోజ్‌ కలైవనన్‌), బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే (సుమన్‌ కుమార్‌, రాజ్‌ అండ్‌ డీకే, సుపర్న్‌ ఎస్‌. వర్మ) కేటగిరీల్లో ఈ సిరీస్‌ హవా కొనసాగించింది. ప్రేక్షకులు తమకు నచ్చిన సిరీస్‌కు ఓటు వేసేందుకు ఫిల్మ్‌ఫేర్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఈనెల 24, యాప్‌ ద్వారా ఈనెల 28 వరకు అవకాశం ఉంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details