ఎక్స్ట్రా జబర్దస్త్ కొత్త ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రాకింగ్ రాకేశ్-రోహిణి, సుడిగాలి సుధీర్-ఆటో రాంప్రసాద్, బుల్లెట్ భాస్కర్ స్కిట్లు నవ్వులు పూయిస్తున్నాయి.
భర్తే ఆఫీస్లో బాస్ అయితే ఎలా ప్రవరిస్తాడో.. ఇంటికి వచ్చాక అతని ప్రవర్తన ఎలా మారిపోతుందో చూపిస్తూ రాకింగ్ రాకేశ్-రోహిణి చేసిన స్కిట్ కడుపుబ్బా నవ్విస్తుంది. ఓ శాపం కారణంగా ఇద్దరు ప్రేమికులు ఎలా ఇబ్బందుల్లో చిక్కుకున్నారో తెలియజేస్తూ బుల్లెట్ భాస్కర్-వర్ష చేసిన స్కిట్ నవ్వుల్లో ముంచెత్తుతుంది.