కామెడీ స్క్రిప్ట్‌లతో కడుపుబ్బా నవ్వించే 'జబర్దస్త్', 'ఎక్స్ట్రా జబర్దస్త్' షోలకు సంబంధించిన కొత్త ప్రోమోలు విడుదలయ్యాయి. అనసూయపై సెటైర్లు వేస్తూ ఆమెతో కలిసి హైపర్ ఆది చేసిన స్కిట్ కితకితలు పెట్టించింది. ఇమ్మాన్యుయెల్ తనదైన శైలిలో మరోసారి కామెడీ పండించాడు.
రాకింగ్ రాకేశ్ ప్రపోజల్ .. రోహిణి అంగీకరించిందా? - ఎక్స్ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్
'జబర్దస్త్' కమెడియన్ రాకింగ్ రాకేశ్.. రోహిణికి ప్రపోజ్ చేశాడు. మరి రోహిణి అతని ప్రేమకు అంగీకరించిందా?
రాకింగ్ రాకేశ్
'ఎక్స్ట్రా జబర్దస్త్'లోనూ ఇమ్మాన్యుయల్, రాకింగ్ రాకేశ్, గెటప్ శ్రీను చేసిన కామెడీ నవ్వులు పూయించాయి. 'ఈ స్టేజ్ ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది.. కానీ నాకు వైఫ్‌ను ఇచ్చింది' అంటూ రాకింగ్ రాకేశ్.. రోహిణికి ప్రపోజ్ చేసిన తీరు కార్యక్రమం మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. తామిద్దరి ఐదేళ్ల ప్రయాణానికి గుర్తుగా ఐదు రకాల గిఫ్ట్‌లను రోహిణికి ఇచ్చాడు. వారిద్దరూ కలిసి 'నా గుండెలో నీవు ఉండిపోవా' పాటకు వేసిన స్టెప్పులు ఆకట్టుకున్నాయి.