తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బుల్లితెరపై '30 వెడ్స్ 21' మ్యాజిక్.. సీజన్-2కన్నా ముందే! - ఎక్స్​ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో

కంటెస్టంట్​ల నాన్​స్టాప్ పంచ్​లతో ప్రతివారం అలరిస్తోంది ఈటీవీలో వచ్చే 'ఎక్స్​ట్రా జబర్దస్త్'. తాజా ఎపిసోడ్​కు ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు '30 వెడ్స్ 21' జోడీ పృథ్వీ, మేఘన.

Extra Jabardasth
ఎక్స్​ట్రా జబర్దస్త్

By

Published : Jul 20, 2021, 5:30 AM IST

యాంకర్ రష్మి అందం, కంటెస్టెంట్ల పంచ్​లు, జడ్జిల రిటర్న్ పంచ్​లతో ఈవారం 'ఎక్స్​ట్రా జబర్దస్త్'​ సందడి సందడిగా సాగనుంది. కెవ్వు కార్తీక్, రాకింగ్ రాకేశ్, సుడిగాలి సుధీర్, బుల్లెట్ భాస్కర్​టీమ్​లు వారి కామెడీతో కడుపుబ్బా నవ్వించాయి. దీనికి సంబంధించి ప్రోమో అలరిస్తోంది. పూర్తి ఎపిసోడ్ ఈటీవీలో జులై 23న రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానుంది.

30 వెడ్స్ 21 జంట సందడి

'30 వెడ్స్ 21' జోడీ పృథ్వీ, మేఘన ఈ వారం ప్రత్యేక అతిథులుగా ఎక్స్​ట్రా జబర్దస్త్​కు విచ్చేశారు. వీరు మరోసారి ఈ వేదికపై చక్కటి పర్ఫామెన్స్ ఇచ్చారు. రష్మి.. మేఘనను సీజన్ 2 ఎప్పుడూ అని ప్రశ్నించగా.. ముందు సుధీర్ వెడ్స్ రష్మి ఎప్పుడంటూ పంచ్ వేసింది మేఘన. ఇది సెట్లో అందరి చేత నవ్వులు పూయించింది.

ఇవీ చూడండి: 'రష్మీ ప్రేమ కోసం వందసార్లయినా మరణిస్తా'

ABOUT THE AUTHOR

...view details