సుడిగాలి సుధీర్ మళ్లీ మ్యాజిక్ చేశాడు. ఇప్పటివరకు ఓ వస్తువును మరో వస్తువుగా మార్చి లేదా మాయం చేసిన అతడు.. ఈసారి ఏకంగా గెటప్ శీనుతోనే ప్రయోగం చేశాడు. ఎక్స్ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో ఇదంతా జరిగింది.
'ఎక్స్ట్రా జబర్దస్త్' లేటెస్ట్ ప్రోమో ఆకట్టుకుంటోంది. సుడిగాలి సుధీర్‌ను టీజ్ చేస్తూ వాళ్ల టీమ్ చేసిన మ్యాజిక్ స్కిట్ అలరిస్తోంది. ఇమ్మాన్యూయేల్-వర్ష.. కొత్తగా బుల్లెట్ భాస్కర్ టీమ్‌లో భాగమయ్యారు. వాళ్లు చేసిన పెళ్లి స్కిట్ మెప్పిస్తోంది. అలానే ఈసారి లేడీస్ స్పెషల్ స్కిట్ ఆసక్తిని పెంచుతోంది.