నటి రోజా, సింగర్ మనో న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తోన్న కామెడీ షో 'ఎక్స్ట్రా జబర్దస్త్'. రష్మి వ్యాఖ్యాతగా చేస్తోన్న ఈ షో ప్రతి శుక్రవారం రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానుంది.
సుడిగాలి సుధీర్ పెళ్లికి అతిథిగా రష్మి! - varsha emmanuel
నటి రోజా, సింగర్ మనో న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తోన్న కామెడీ షో 'ఎక్స్ట్రా జబర్దస్త్'. నేటి రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో ఈ ఎపిసోడ్ ప్రోమోను చూసి నవ్వుకోండి.
ఈ ఎపిసోడ్లో సుధీర్.. తన పెళ్లికి పిలవలేదని స్నేహితులైన ఆటో రామ్‌ప్రసాద్, గెటప్ శ్రీను పెళ్లి కాన్సిల్ చేయడానికి ప్రయత్నిస్తారు. యాంకర్ రష్మీని అతిథిగా పిలిచి వారిద్దరి మధ్య ఏదో ఉందని బంధువులను నమ్మిస్తారు. ఆ విధంగా తమ స్కిట్లో నవ్వులను పంచారు. రాకేశ్ మాస్టర్ పెళ్లి చూపుల్లో బులెట్ భాస్కర్, నరేశ్ పంచ్‌లతో నవ్వించారు. పచ్చదనం తన బలహీనత అనే కాన్సెప్ట్‌తో ముందుకొచ్చారు రాకింగ్ రాకేశ్. 'మనసంతా నువ్వే' స్పూఫ్‌తో కెవ్వు కార్తిక్ టీమ్ కామెడీ చేసింది. ఇమ్మాన్యూయేల్పై తన ప్రేమను వర్ష మరోసారి చాటుకుంది.
ఇదీ చూడండి:ఆర్ఆర్ఆర్: రామరాజు నయా అవతార్ అప్డేట్