ఈ వారం 'ఎక్స్ట్రా జబర్దస్త్'(Extra Jabardast Latest Promo) అదిరిపోయింది. 'వకీల్‌సాబ్'గా రాకింగ్ రాకేశ్ తన హీరోయిజాన్ని చూపిస్తూనే కడుపుబ్బా నవ్వించాడు. బల్లాలదేవగా ఇమ్మాన్యుయెల్, కట్టప్పగా సుడిగాలి సుధీర్.. 'బాహుబలి' భాస్కర్‌తో కలిసి చేసిన కామెడీ నవ్వులు పూయించాయి.
రష్మి, సుడిగాలి సుధీర్ కంటతడి.. ఏమైందంటే? - Extra Jabardast today
ఎప్పుడూ సరదాగా ఉండే రష్మి, సుధీర్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తమ మధ్య ఉన్న బంధం గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు.
యూట్యూబ్ స్టార్స్ నెల్లూరు కుర్రోళ్లు ఈ ఎపిసోడ్లో సందడి చేశారు. ఆ తర్వాత గెటప్ శ్రీను, హైపర్ ఆది, సుధీర్ కలిసి కితకితలు పెట్టించారు. మొత్తంగా నవ్వుల పండగగా సాగిన ఈ కార్యక్రమం చివర్లో కంటెస్టెంట్లు కన్నీరు పెట్టుకున్నారు. తమ నిజజీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, ఎదురైన అందమైన అనుభూతులను పంచుకున్నారు. ఇందులో భాగంగా సుధీర్, రష్మి తామిద్దరి మధ్య ఉన్న బంధాన్ని తెలుపుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ ప్రోమోనూ మీరూ చూసేయండి..
ఇదీ చూడండి: సుధీర్-రాంప్రసాద్ పంచులు.. పడిపడి నవ్విన ఇంద్రజ