ప్రతి పండగకు ప్రత్యేక షోలు నిర్వహించి, తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తుంది ఈటీవీ. ఈసారి వినాయక చవితికి ప్రేక్షకులను విపరీతంగా నవ్వించేందుకు సిద్ధమైంది. 'ఊరిలో వినాయకుడు' పేరుతో ప్రోగ్రాం ప్లాన్ చేసింది. దీనికి సంబంధించిన రెండో ప్రోమోను విడుదల చేయగా అది కాస్తా.. యూట్యూబ్‌లో బాగా సందడి చేస్తోంది.
రష్మి ప్రేమించాలంటూ..
సుడిగాలి సుధీర-రష్మి ఒకరిమీద ఒకరు పంచ్‌లు వేసుకుంటూ చేసిన యాంకరింగ్‌తో మొదలైన ఈ కార్యక్రమం ఆద్యంతం నవ్వులు పూయించింది. ఈ క్రమంలోనే రష్మి తనను ప్రేమించాలంటూ తన మనసులోని మాటను వినాయకుడి ముందు పెట్టాడు సుధీర్.
రోజా వర్సెస్ ఇంద్రజ
లడ్డు వేలంపాట కోసం రోజా, ఇంద్రజ టీమ్ హోరాహోరీగా పోటీపడ్డాయి. ఈ క్రమంలోనే ఈ సీనియర్ నటీమణులిద్దరూ ఒకరిపై మరొకరు సెట్టైర్లు వేసుకుంటూ సరదా వాగ్వివాదానికి దిగారు. ఆ పంచ్‌ల నుంచి వారిని డైవర్ట్ చేయడం కోసం హైపర్ ఆది కలుగజేసుకుని 'కామెడీ చేయమంటే ఆటో వెనుక కొటేషన్స్ చెప్తారేంటిరా..' అంటూ నవ్వులు పూయించాడు.
హగ్స్ పోటీ
ఇక హైపర్ ఆది, రాంప్రసాద్ కలిసి ఓ షాపింగ్ మాల్లో అమ్మాయిల విషయంలో తలపడుతూ సందడి చేశారు. తామిద్దరిలో ఆడపిల్లలు ఎవరికి ఎక్కువ హగ్స్ ఇస్తారంటూ పోటీకి దిగారు. దీనికి సంబంధించిన వీడియోను షోలో ప్రసారం చేసి కితకితలు పెట్టించారు.