Naagin 6 budget: హిందీలో ఫేమస్ సీరియల్స్‌లో 'నాగిని' ఫ్రాంచైజీ ఒకటి. ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ ధారావాహిక ఆరో భాగం త్వరలో ప్రసారం కానుంది. వసంత పంచమి నుంచి దీనిని ప్రేక్షకులు అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే ఈ సారి 'నాగిని' సీరియల్ కోసం భారీ బడ్జెట్ పెట్టేందుకు నిర్మాత ఏక్తా కపూర్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Bigg boss 15 winner: బిగ్‌బాస్-15 విజేతగా నిలిచిన తేజస్వి ప్రకాశ్.. ఈసారి 'నాగిని' పాత్రలో నటించనుంది. అయితే టీవీ ఇండస్ట్రీలో ఏ షోకు లేనంతగా ఈ సీరియల్‌కు రూ.130 కోట్లతో నిర్మించనున్నట్లు సమాచారం. ఈసారి భారీ హంగులతో సీరియల్ ఉండనున్నట్లు తెలుస్తోంది. బయోలాజికల్ వార్ నేపథ్య కథాంశంతో ఈసారి సీరియల్‌ను రూపొందించనున్నారు!
బడ్జెట్ విషయమై నిర్మాత ఏక్తా కపూర్‌ను పలువురు హెచ్చరిస్తున్నప్పటికీ, ఆమె మాత్రం వెనుకడుగు వేయడం లేదు! ఈ భాగం ప్రేక్షకాదరణ దక్కించుకోకపోతే మాత్రం ఈసారితో ఈ సీరియల్‌ను ముగించేయాలని ఏక్తా భావిస్తున్నారట.