తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సూర్య, విక్రమ్‌, అజిత్‌ వాయిస్​తో నాన్​స్టాప్ డైలాగ్స్! - మోహన్​లాల్ గొంతుతో శ్రీనివాస్

తమిళ, మలయాళ స్టార్ హీరోలు మోహన్​లాల్, సూర్య, విక్రమ్, అజిత్​లకు డబ్బింగ్ చెబుతూ అందర్నీ అలరించారు డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస్. తాజాగా ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో పాల్గొన్న ఆయన ఒకేసారి పలువురు హీరోల గొంతులు వినిపించి ఆకట్టుకున్నారు.

Dubbing Artist Srinivas at Sridevi Drama Company
సూర్య, విక్రమ్‌, అజిత్‌ వాయిస్​తో నాన్​స్టాప్ డైలాగ్స్!

By

Published : Feb 9, 2021, 8:24 AM IST

Updated : Feb 9, 2021, 8:53 AM IST

తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్‌ హీరోలు సూర్య, మోహన్‌లాల్‌ తెలుగు ప్రేక్షకులకు ఎంతటి సుపరిచితులో తెలిసిందే. మరి సినిమాల్లో వాళ్లకు తెలుగులో డబ్బింగ్‌ చెప్పేదెవరో తెలుసా..? వాళ్లకు గొంతునిచ్చేది డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ శ్రీనివాస్‌. మోహన్‌లాల్‌, సూర్య, విక్రమ్‌, అజిత్‌, ఉపేంద్ర ఇలా ఎంతో మంది స్టార్‌ హీరోలకు ఆయన డబ్బింగ్‌ చెప్పారు.

'ఈటీవీ'లో ప్రసారమయ్యే 'శ్రీదేవీ డ్రామా కంపెనీ'లో శ్రీనివాస్ పాల్గొన్నారు. ఒకేసారి పలువురు స్టార్‌హీరోల గొంతులు వినిపించి అందర్నీ అలరించారు. హీరోలకు సినిమాల్లో నుంచి పవర్‌ఫుల్‌ డైలాగులను గుక్కతిప్పుకోకుండా చెప్పగా.. కార్యక్రమంలో ఉన్నవాళ్లంతా ఎంజాయ్‌ చేశారు. ఆ వీడియో యూట్యూబ్‌లో ఉంది. మీరూ చూసేయండి మరి...

Last Updated : Feb 9, 2021, 8:53 AM IST

ABOUT THE AUTHOR

...view details