నిండునూరేళ్లు జీవించమని పెద్దవాళ్లు దీవిస్తుంటారు. మనకూ.. వందేళ్లు నిండేదాకా సంతోషంగా జీవించాలని ఉంటుంది. అందుకోసం వర్కౌట్స్, డైట్, యోగా.. ఇలా చాలానే చేస్తుంటాం. కానీ మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు , కాలుష్యం కారణంగా మనిషి సగటు ఆయుర్దాయం క్రమంగా తగ్గిపోతూ వస్తుంది.
అయితే.. పాటలు పాడటం వల్ల జీవితంలో ఎక్కువకాలం జీవించవచ్చని ఓ సర్వేలో తేలింది. అవును.. పాటలను పాడటం వల్ల మనిషి ఆయుర్దాయం పెంచుకోవచ్చని ఆ సర్వే చెబుతోంది. మరింకెందుకు ఆలస్యం. మీరూ ఎంచక్కా పాడటం నేర్చుకోండి.
ఈటీవీలో ప్రసారమవుతూ.. వినోదాన్ని విజ్ఞాన్ని పంచే కార్యక్రమంగా పేరున్న క్యాష్ ప్రోగ్రామ్‌లో ఈ ప్రశ్నను వ్యాఖ్యత సుమ అడిగారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన నటులు ప్రదీప్ మాచిరాజు, రష్మీ, అనీ మాస్టర్ ,శేఖర్ మాస్టర్ హాస్యాస్పదంగా సమాధానాలిచ్చారు. ఈ ప్రశ్నకు అనీ.. సరిగ్గా బదులిచ్చారు. ఈ క్రమంలో మరిన్ని ప్రశ్నలు సంధించారు సుమ.
ప్రశ్న: ఏం చేయటం వలన మెమోరీ లాస్‌ను రికవర్ చెయ్యొచ్చు?