తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Dhee 13: 'ఢీ'లో రజనీకాంత్‌ మేనియా.. అదరగొట్టారుగా! - ప్రియమణి

సూపర్​స్టార్​ రజనీకాంత్​ మేనియాతో ఢీ షో హోరెత్తిపోయింది. ఆయన నటించిన 'నరసింహా' చిత్రంలోని డైలాగులు, పాటలను అదే తరహాలో పునఃసృష్టించి విశేషంగా ఆకట్టుకున్నారు కింగ్స్​, క్వీన్స్​ జట్లు.

Dhee 13
ఢీ

By

Published : Aug 13, 2021, 12:10 PM IST

ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్‌ నటించిన 'నరసింహ' చిత్రంలోని పాటలు, సన్నివేశాలతో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించింది 'ఢీ 13' కార్యక్రమం. బుధవారం ప్రసారమైన ఈ ఎపిసోడ్‌ ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. ప్రదీప్‌ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ఈ షోలో కింగ్స్‌, క్వీన్స్‌ జట్లు ఉన్నాయి. క్వీన్స్‌ బృందంలోని మంజుల.. రజనీకాంత్‌గా కనిపించి, ప్రతి ఒక్కరినీ ఫిదా చేసింది.

'నరసింహ' చిత్రంలో రజనీ ఎంత స్టైలిష్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. అదే తరహాలో దర్శనమిచ్చి, రజనీ హావభావాలకు ఏమాత్రం తగ్గకుండా నటించింది మంజుల. డ్యాన్స్, డైలాగుల్లో రజనీని గుర్తుచేస్తూ మెస్మరైజ్‌ చేసింది. బుల్లితెరపైకి జూనియర్‌ రజనీకాంత్‌ వచ్చారా? అనిపించేలా తన ప్రతిభ చూపింది. అటు పాటలు, ఇటు సంభాషణలతో 'నరసింహ' సినిమాని చూపించింది 'మంజుల' టీం.

రజనీకాంత్‌.. సుధీర్‌, రమ్యకృష్ణ.. ప్రియమణి, పూర్ణ

ఇదే ఎపిసోడ్‌లో ప్రేక్షకులకి వినోదం పంచేందుకు టీమ్ లీడర్లు, న్యాయనిర్ణేతలు కొందరు నటుల్ని ఇమిటేట్‌ చేశారు. ప్రకాశ్‌ రాజ్‌గా సుధీర్‌, రామ్‌ చరణ్‌గా ఆది కనిపించి నవ్వులు పంచారు. రష్మి, దీపికా పిల్లి, ఆది, సుధీర్‌ మధ్య సాగిన సంభాషణలు వింటే పొట్ట చెక్కలవ్వాల్సిందే.

తర్వాత సుధీర్‌.. రజనీకాంత్‌ (నరసింహ)లా మారతాడు. పూర్ణ.. రమ్యకృష్ణలా సుధీర్‌తో కలిసి డ్యాన్సు చేస్తుంది. ప్రియమణి.. రమ్యకృష్ణలా భారీ డైలాగ్‌ చెప్తుంది. ఇంకెందుకు ఆలస్యం 'రజనీ' మేనియాని చూసేయండి..

ఇదీ చూడండి:Dhee 13: 'ఆచార్య' పాట 'ఢీ'లో.. మీరు చూశారా?

ABOUT THE AUTHOR

...view details