తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రష్మి అందంపై సుధీర్​ కామెంట్స్​ - ఢీ 13 ప్రోమో

ఈ సారి వినాయకచవితిని పురస్కరించుకుని ప్రసారం కానున్న 'ఢీ' షో(Dhee 13 latest edpisode) ప్రేక్షకులను ఉర్రూతలూగించం ఖాయం. కంటెస్టెంట్ల డ్యాన్స్​​ పెర్ఫార్మెన్స్, ఆది, సుధీర్​ పంచ్​లతో కార్యక్రమం హోరెత్తిపోయింది. ఈ ప్రోమోను మీరు చూసేయండి..

sudheer
సుధీర్​

By

Published : Sep 2, 2021, 2:11 PM IST

కంటెస్టెంట్ల డ్యాన్సులతో పాటు సుడిగాలి సుధీర్‌, ఆది, ప్రదీప్‌ కామెడీతో ఆద్యంతం అలరించే డ్యాన్స్ షో 'ఢీ 13: కింగ్స్‌ వర్సెస్‌ క్వీన్స్‌'(Dhee 13 latest edpisode). ఈటీవీలో ప్రతి బుధవారం రాత్రి 9:30 గంటలకు ప్రసారమవుతుంది. ఈ సారి వినాయకచవితిని పురస్కరించుకుని ప్రసారం కానున్న కొత్త ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలై వినోదం పంచుతోంది.

కంటెస్టెంట్​ల డ్యాన్స్​ పెర్ఫార్మెన్స్​ ప్రేక్షకులతో ఈల వేయిస్తోంది. ఇక యాంకర్​ ప్రదీప్​.. రష్మి, దీపిక యాంకరింగ్​పై చేసిన కామెంట్స్​కు హైపర్​ ఆది, సుడిగాలి సుధీర్​ చేసిన కామెడీ నవ్వులు పూయిస్తోంది. అవకాశం దొరికినప్పుడల్లా రష్మిపై సుధీర్(sudheer rashmi dhee jodi)​ పంచ్​లు వేస్తూ.. తన మనసులోని ప్రేమను బయటపెట్టడం ఆకట్టుకుంటోంది. కార్యక్రమం చివర్లో రష్మి కళ్ల జోడు పెట్టుకుని చేసిన స్టైలిష్​ పెరఫార్మెన్స్​కు వీక్షకులు కేరింతలతో హోరెత్తించారు. దీనికి సంబంధించిన ప్రోమోను చూసేయండి..

ఇదీ చూడండి: Dhee 13: ప్రియమణి, పూర్ణ తీన్మార్​​ డ్యాన్స్​

ABOUT THE AUTHOR

...view details