దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రియాలిటీ డ్యాన్స్ షో 'ఢీ13' కింగ్స్ వర్సెస్ క్వీన్స్(Dhee 13 kings vs queens). దీని లేటేస్ట్ ప్రోమో అలరిస్తోంది. ఇందులో డ్యాన్సర్లు ప్రదర్శనతో అదరగొట్టారు. అట్టడుగున ఉన్న ముగ్గురు కింగ్స్.. మరో ముగ్గురు క్వీన్స్‌కు మధ్య జరిగిన ఈ పోరు ఆకట్టుకుంది. వచ్చే బుధవారం(జూన్ 23) ఎలిమినేషన్ జరగనున్న కారణంగా డ్యాన్సర్లు హోరాహోరీగా పోటీపడ్డారు.
రిసార్ట్‌లో ఆది-ప్రియమణి, సుధీర్-పూర్ణ.. సందడే సందడి - సుడిగాలి సుధీర్
ఢీ 13(Dhee 13) లేటేస్ట్ ప్రోమో అలరిస్తోంది. సుధీర్, ఆది, పూర్ణ, ప్రియమణి చేసిన స్కిట్ నవ్విస్తూ, ఎపిసోడ్‌పై ఆసక్తి రేపుతోంది. జూన్ 23న పూర్తి ఎపిసోడ్, రాత్రి 9:30 గంటలకు ప్రసారం కానుంది.
రిసార్ట్‌లో ఆది-ప్రియమణి, సుధీర్-పూర్ణ.. సందడే సందడి
మరోవైపు టీమ్ లీడర్లు సుధీర్(Sudigaali Sudheer), ఆది(Hyper Aadi).. రష్మీ(Rashmi), దీపికలతో కాకుండా పూర్ణ, ప్రియమణిలతో స్కిట్ చేసి తెగ నవ్వించారు. ఆ తర్వాత లేడీ కంటెస్టెంట్‌తో పండు డ్యాన్స్ చేశాడు. అయితే ఆ అమ్మాయి ఎలిమినేట్ అయితే పరిస్థితి ఏంటని జడ్జెస్ అతడిని అడిగారు. దీంతో షోలో టెన్షన్ ఏర్పడింది. ఇంతకీ ఎవరు ఎలిమినేట్ అయ్యారు. అది తెలియాలంటే మరో వారం ఆగాల్సిందే.
ఇదీ చూడండి..Dhee: మాస్ డ్యాన్స్‌తో దుమ్మురేపిన రష్మీ
Last Updated : Jun 18, 2021, 5:12 PM IST