తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సామాజికి చిత్రాలకు మకుటం డీడీఎస్​ - జహీరాబాద్​లో డీడీఎస్​ ఫిల్మ్​ఫెస్ట్​వల్​

సామాజిక చిత్రాలను ప్రోత్సహించే విధంగా డీడీఎస్​ ఆధ్వర్యంలో ఫిల్మ్‌ ఫెస్ట్‌ అట్టహాసంగా జరిగింది. ఇందులో వివిధ చిత్రాలు ప్రదర్శించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఫిల్మ్ ఫెస్ట్‌కి ప్రముఖ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఇలాంటి ప్రదర్శనలు మరిన్ని జరగాలని ఆకాంక్షించారు.

సామాజికి చిత్రాలకు మకుటంగా నిలుస్తున్న డీడీఎస్​
సామాజికి చిత్రాలకు మకుటంగా నిలుస్తున్న డీడీఎస్​

By

Published : Feb 14, 2021, 12:33 PM IST

సామాజికి చిత్రాలకు మకుటంగా నిలుస్తున్న డీడీఎస్​

గ్రామీణులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని దక్కన్ డెవలప్ మెంట్ సోసైటీ.... 2017లో కమ్యూనిటీ మీడియా ట్రస్టును ఏర్పాటు చేసింది. ఏటా జై చందీరాం మెమోరియల్ ఫిల్మ్ ఫెస్ట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది పోటీలకు వివిధ రాష్ట్రాల నుంచి 27చిత్రాలు, విదేశాల నుంచి 7 సినిమాలు వచ్చాయి. పలు అంశాల వారీగా రెండు దశల్లో పరిశీలించి 6 చిత్రాలను ప్రదర్శనకు ఎంపిక చేశారు. ఇందులోంచి జ్యూరీ మూడింటిని అవార్డు కోసం ఎంపిక చేసింది.

భవిష్యత్తులో మరిన్ని...

ఈ ఫిల్మ్‌ ఫెస్ట్‌లో ఈశాన్య రాష్ట్రాల్లోని ఓ గిరిజన తెగ సమైఖ్య జీవనవిధానం, వారి ఆచార వ్యవహారాల ఇతివృత్తంగా తెరకెక్కించిన లాంగ్ డ్రమ్ ఆఫ్ ఫెసావో చిత్రానికి మొదటి బహుమతి వచ్చింది. అకాల వర్షాల వల్ల ఛిద్రమైన ఓ సన్నకారు రైతు కథ నేపథ్యంతో నిర్మించిన బుచ్చడ్ సినిమా రెండో బహుమతి అందుకుంది. మహిళలనూ రైతులుగా గుర్తించాలన్న కథాశంతో తీసిన ఐడెంటిఫై ఆఫ్ ఏ ఉమెన్ యాజ్‌ ఫార్మర్​కు మూడో బహుమతి దక్కింది. భవిష్యత్తులో ఇలాంటి ఫెస్టివల్స్‌ మరిన్ని నిర్వహిస్తామని డీడీఎస్​ ప్రతినిధులు తెలిపారు.

ఇలాంటివి మరిన్ని రావాలి..

సామాజిక చిత్రాలను ప్రోత్సహించేందుకు ఇటువంటి ఫిల్మ్ ఫెస్టివల్స్ మరిన్ని రావాలని దర్శకుడు నాగ్ అశ్విన్ అభిలాశించారు. ఫెస్టివల్‌లో ప్రదర్శించిన చిత్రాలు గ్రామీణ ప్రాంత సమస్యలు, సామాజిక అంశాలు కళ్లకు కట్టేలాచూపించాయని కొనియాడారు. సామాజిక అంశాలపై చిత్రాలు తీయడానికి ఈ ఫెస్టివల్ ప్రోత్సహకరంగా ఉందని పలువురు ప్రతినిధులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఎన్టీఆర్‌ జీవితంపై పుస్తకం.. ఆవిష్కరించనున్న ఉపరాష్ట్రపతి

ABOUT THE AUTHOR

...view details